ASBL Koncept Ambience

మోదీకోసం ప్రత్యేక వంటకాలు

మోదీకోసం ప్రత్యేక వంటకాలు

అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశారు. ప్రముఖ  చెఫ్‌ కిరణ్‌ వర్మ ప్రధాని కోసం ప్రత్యేకంగా రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి పేరుతో పసందైన వంటకాలను వడ్డించనున్నారు. ఐక్యరాజ్యసమితి 74వ సాధారణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ బసచేసే హోటల్‌లోతో పాటు అమెరికా పర్యటన ఆసాంతం ప్రత్యేక మెనూతో చవులూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. దేశీ నెయ్యితో వంటకాలను తయారుచేస్తారు. నమో తాలి మిఠాయిలో రస్‌మలై, గజర్‌ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌లు ఉండగా, నమో తాలి సేవ్రిలో కిచిడీ, కచోరీ, మేతి తెప్లా వంటకాలున్నాయి. పలు రాష్ట్రాలు, నగరాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను ప్రధాని కోసం సంసిద్ధం చేస్తామని చెఫ్‌ కిరణ్‌ పేర్కొన్నారు. ప్రధాని ఆరగించే పదార్ధాలను సిద్ధం చేయడం తనకు ఇదే తొలిసారని ఆమె తెలిపారు.

 

Tags :