నేడు రుత్వికుల ఆహారం ఇదే
అయుత మహా చండీయాగానికి రుత్విక్కులే కీలకం. పరమ నిష్టాగరిష్ఠులైన పదిహేను వందల మంది పండితులు యాగ నిర్వహణలో పాల్గొంటున్నారు. రుత్విక్కులు ప్రతిఒక్కరూ ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. యాగశాలలో మంచినీళ్లు కూడా ముట్టారు. దీక్షాబద్దులు యాగం జరిగే ప్రాంతాన్ని సైతం విడిచి వెళ్లరు. రుత్విక్కుల నేటి భోజన వివరాలిలా ఉన్నాయి. ఉదయం అల్పాహారంలో అటుకుల పొంగలి, చట్నీ, మధ్యాహ్న భోజనంలో అన్నం చపాతి, ఆకుకూర పప్పు, రసం, క్యాప్సికం కూర, సాంబారు, ఆలుబోండ, బాదుషా, పులిహోర, రోటి పచ్చడి, రాత్రి సమయంలో పూరి, పన్నీర్ బటర్ మసాల, ఆలు కుర్మాలను అల్పాహారంగా తీసుకోనున్నారు.
Tags :