ASBL Koncept Ambience

తానా ఆధ్యాత్మికం

తానా ఆధ్యాత్మికం

తానా కాన్ఫరెన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులు మహాసభలకు తరలివస్తున్నారు. జ్యోతిష్య నిపుణుడు డా. శంకరమంచి రామకృష్ణశాస్త్రి, ఆధ్యాత్మిక గురు స్వామి పరిపూర్ణానంద, సిద్ధయోగ నిపుణురాలు భువనగిరి సత్య సింధుజ, రుద్రాక్ష గురు డా. పాండురంగారావు, శ్రీ విశ్వంజీ మహారాజ్‌, వాస్తు శాస్త్ర నిపుణుడు నాగమల్లేశ్వరరావు, చక్రసిద్‌, రాజ్యలక్ష్మి తదితరులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే మహాసభల వేదికపై అన్నమయ్య సప్తగిరి సంకీర్తన గళార్చన పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. జూలై 6వ తేదీన మహాసభల వేదికపై జరిగే ఈ కార్యక్రమంలో గురు చైతన్య సోదరులతోపాటు 108 మంది కళాకారులు పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను గానం చేయనున్నారు.

 

Tags :