ASBL Koncept Ambience

నాట్స్‌ ఆధ్యాత్మికం

నాట్స్‌ ఆధ్యాత్మికం

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. 

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శ్రీనివాస కళ్యాణం వంటి కార్యక్రమాలతోపాటు ప్రవచన కార్యక్రమాలను, కీర్తనల గానం వంటివి ఈ కార్యక్రమాల్లో చోటు చేసుకున్నాయి. శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి ప్రవచనాలు, శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం అన్నమాచార్య కీర్తనలు అందరినీ అలరిస్తాయని ఆధ్యాత్మిక కమిటీ చెబుతోంది. న్యూజెర్సిలోని శ్రీ శివవిష్ణు టెంపుల్‌, సాయిదత్తపీఠం, ఓమ్‌ శ్రీబాలాజీ టెంపుల్‌ సహకారంతో పెద్ద ఊరేగింపును కీర్తనల గానం మధ్య నిర్వహిస్తున్నారు. 

 

 

Tags :