తానా మహాసభలు.... ఆటల పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) జులై 7, 8, 9 తేదీలలో ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ‘తానా’ 23వ మహాసభల్లో భాగంగా పలు ఆటల పోటీలను ఏర్పాటు చేసింది. అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన, రవి పొట్లూరి కన్వీనర్ గా జరిగే ఈ మహాసభల్లో స్పోర్ట్స్ కమిటీ చైర్‌గా శ్రీరామ్ ఆలోకం, హరీష్ కూకట్ల, చలం పావులూరి కోచైర్స్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత 2021-23 తానా కార్యవర్గంలో స్పోర్ట్స్ కో ఆర్డినేటర్‌గా ఉన్న శశాంక్ యార్లగడ్డ కన్వెన్షన్ స్పోర్ట్స్ టీంకి సహకరిస్తున్నారు. తానా క్రికెట్ ప్రీమియర్ లీగ్, టెన్నిస్, వాలీబాల్, బాడ్మింటన్, పికెల్ బాల్, త్రోబాల్ వంటి పలురకాల క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఆటల పోటీల్లో పాల్గొనాలనుకునేవారు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి తమ తమ జట్లను రిజిస్టర్ చేసుకోవలసిందిగా కోరుతున్నారు.
https://tinyurl.com/TANAPremierLeague
Click here for TANA Sports Flyers