ASBL Koncept Ambience

తానా అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీనివాస గోగినేని

తానా అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీనివాస గోగినేని

ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్ష అభ్యర్థిగా శ్రీనివాస గోగినేని నామినేషన్‌ వేశారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా ఉన్న శ్రీనివాస గోగినేని తానా ద్వారా మరింతగా కమ్యూనిటీకి సేవలందించేందుకు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న్ణట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన తానా నీది నాది మనందరిదీ అనే నినాదంతో గోగినేని ఫర్‌ తానా పేరుతో ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. డిట్రాయిట్‌లో ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 18వ తేదీన ఆయన మిత్రులు ఏర్పాటు చేశారు. ఫర్మింగ్టన్‌హిల్స్‌లోని  సెయింట్‌ తోమా బాంక్వెట్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనున్నది. \r\n', 

Tags :