అష్టాక్షరి జపాలతో సాగిన శ్రీ లక్ష్మీనారాయణ పూజలు
హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించారు. యజ్ఞ కుండలాల్లో అష్టాక్షరి జపం పఠిస్తూ యాగం చేశారు. అనంతరం యాగశాలల్లో చిన జీయర్‌స్వామి పర్యటించారు. జగద్గురు వాసుదేవాచార్య, స్వామి విద్యాభాస్కర్‌లు భక్తులకు శ్రీరామానుజాచార్యుల వైభవాన్ని వివరించారు. భద్రాచలం నుంచి వచ్చిన శ్రీమాన్ గుడిమోళ్ల మురళీకృష్ణమాచార్య, అథర్వ వేదపండితులతో కలిసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. సప్తస్వర సంగీత అకాడమి వారి ఆధ్వర్యంలో కళాకారులు ప్రజ్ఞ, మనోజ్ఞలు సంగీత రaరితో ఆకట్టుకున్నారు. సహస్రాబ్ది సమావేశ మందిరంలో సుష్మా, సుస్మిత బృందం గానాలాపన చేశారు. పెద్దబ్రోలు భావన బృందం నృత్యప్రదర్శనలు, శ్రీమాన్ స్థలశాయి యుజుర్వేద పండితుల పుణ్యవచనాలు చేశారు. మానస భజన బృందం స్వామివారి కీర్తనలతో భక్తులను అలరింపచేశారు. రాజమహేంద్రవరం నుంచి విచ్చేసిన రఘునాథ్ భట్టర్ ప్రవచనాలను భక్తులకు వివరించారు. అనంతరం వేదపండితులతో కలిసి త్రిదండి చినజీయర్ స్వామిజీ వెంకన్న స్వామి భజన, విష్ణునామ సహస్ర పారాయణాలు, శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి ప్రవచనాలు, వేదాల విశిష్టతను వివరించారు.