నేటి నుంచి రామానుజుల సహస్రాబ్ది వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ మహోత్సవం ఈ నెల 14వ తేదీ వరకు జరగనుంది. దీనిని తిలకించడానికి దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రముఖులు తరలిరానున్నారు. రామానుజాచార్యులు ఇచ్చిన సమతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 1035 కుండాలతో లక్ష్మీనారాయణ మహాయజ్ఞం నిర్వహించబోతున్నారు. మొదటి రోజు నుంచి యజ్ఞయాగాలు, పూజా తంతులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 5న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో నిర్మించిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 13న 120 కిలోల బంగారు రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. ఇలా రోజుకో ప్రముఖుడు సందర్శించనున్నారు. 8, 9వ తేదీల్లో సాధువులు, పంతులు పాల్గొంటారు. వచ్చిన వారికి ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు.