ASBL Koncept Ambience

శ్రీ చినజీయర్ స్వామిజి సూచనలు.. ప్రత్యేక శ్రద్ధ వల్లనే రామానుజ సహస్త్రాబ్ది మందిరం నిర్మాణం

శ్రీ చినజీయర్ స్వామిజి సూచనలు.. ప్రత్యేక శ్రద్ధ వల్లనే రామానుజ సహస్త్రాబ్ది మందిరం నిర్మాణం

పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మహాసంకల్పానికి  వాస్తవ రూపమే శ్రీరామానుజ సహస్రాబ్ది `సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం.  వెయ్యేండ్ల క్రితం ఈ భూమిపై అవతరించి 120 సంవత్సరాలు ఈ భూమిపై వెంచేసి ఉండి మానవళి గమనాన్ని ప్రభావితం చేసి ఒక జీవిత గమ్యాన్ని నిర్దేశించిన మహాప్రవక్త శ్రీ రామానుజాచార్యులు. మనిషిని మనిషిగా చూడలేని మనుషులనే పేరుతో సంచరిస్తున్న ఛాందసవాదులకు కనువిప్పు కలిగేలా చూడలేని మనుషులనే పేరుతో సంచరిస్తున్న ఛాందసవాదులకు కనువిప్పు కలిగేలా భగవంతుని ముందు మనుషులంతా సమానమే అన్న సమతా సందేశాన్ని అనుగ్రహించడమే కాకుండా స్వయంగా ఆచరించి చూపిన మహా మనిషి శ్రీరామానుజాచార్యులు .  భగవంతుని పొందడానికి భక్తియే ప్రధానమనీ, కులము, జాతి, లింగము మొదలైనవి అడ్డుగోడలు కావని జాతి గమనాన్ని నిర్దేశించిన సామాజిక విప్లవకారులు శ్రీ రామానుజాచార్యులు. ఆ మహాప్రవక్త వెయ్యేళ్ల అవతార వేడుకలు సందర్భంగా వారు సమాజానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి భోధనలను మరొక్కసారి మానవాళికి గురుతష్ట్రÊ చేయాలనీ,  మరో వెయ్యేండ్లు గుర్తుండిపోయే విధంగా పున ప్రతిష్ఠింపచేయాలని పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వారు సంకల్పించారు.

అందులో  ముఖ్యంగా ఒక బృహత్‌ కేంద్రాన్ని నిర్మించాలని సంకల్పించారు.  1. శ్రీరామానుజుల వారి విరాట్‌ మూర్తి నిర్మాణం 2. వారికి సమతా స్ఫూర్తిని కల్గించిన 108 దివ్యదేశ ఆలయాల నమూనాలను నిర్మించడం 3. వారి జీవిత విశేషాలను లఅతి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించగల ప్రదర్శన శాలలు ఏర్పాటు చేయడం. 4. ప్రాచీన వేదాంత గ్రంధాలన్నీ ఒక్కచోట దొరికే వీలుగా డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు. ఇలాంటి ఎన్నో విశేషాలతో శ్రీ సహస్రాబ్ధి ప్రాజెక్టు రూపకల్పన మొదలయ్యింది. శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి వారి ఆలోచనలకు అనుగుణంగా బృహత్‌ నిర్మాణ ప్రణాళిక ఇప్పుడు వాస్తవరూపం దాల్చడం మొదలయ్యింది. ఆగమ, శిల్ప శాస్త్రాలను ఈ నిర్మాణ ప్రణాళికతో మేళవించాల్సి వుంది. అదే సమయంలో ఒక పర్యాటక కేంద్ర నిర్మాణానికి ఉండవలసిన నియమ నిబంధనలను అనుసరించాలి. చూపరులకు కనులవిందు చేసే అద్భుత ప్రణాళిక పూర్తిస్థాయిలో అమలు కావాల్సి వుంది. దేవాలయ వాస్తు, సంప్రదాయ శిల్ప  శాస్త్రాలలో విష్లాతులైన ఒక ప్రధాన స్థపతి నేతృత్వంలో మరో ముగ్గురు స్థపతుల బృందం ఈ ప్రాజెక్టు రూపకల్పన పనిని మొదలు పెట్టి కేవలం 6 నెలలో రూప కల్పన చేశారు.

ప్రపంచంలోని అనేక బృహత్‌ విగ్రహాలను పరిశీలించి 108 దివ్య దేశాలలో సుమారు 92 దివ్యదేశాలు పర్యటించి కొన్ని ఫోటోలు, తీసి, వేలాది హ్యాండ్‌ స్కెచెస్‌ గీసి, వందలాది డ్రాయింగ్‌లోనూ శ్రీ చిన్న జీయర్‌ స్వామి వారు, వారి ఊహలకు సరిపోతున్నవో లేదో పరిశీలించి తగు సూచనలు అందిస్తుంటే, ఆ సూచనలు పాటిస్తూ తగిన మార్పులు చేర్పులు చేస్తూ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది.  ఇందులో ప్రధానంగా.. 54 అడుగుల ఎత్తయిన భద్రవేది శ్రీరామానుజుల వారి పీఠము) ఇది 3 అంతస్తులుగా ఉంటుంది. చతురస్రాకృతితో నిర్మితమై మధ్యలో ముఖ భద్రాలతో కూడి ఒక శ్రీ యంత్రం ఆకృతిని పోలి ఉంటుంది. ఇది 282 అడుగుల పొడవు, 282 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అంగుళమానంలో  (3384 అంగుళాలు 3384 అంగుళాలు) ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌ 63,000 చ॥ అడుగుల విస్తారం కలిగి ఉంటుంది. ఇది 90 స్తంభాలతో కూడిన నిర్మాణం. ఈ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శ్రీ రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రను చిత్ర కళా ప్రదర్శనగా రూపొందబోతోంది. ఈ చిత్రాలకు ఏఆర్‌ ఆగ్మంటెడ్‌ రియాలిటీ అనుసంధానం  చేస్తున్నారు.  ఇందులో ఒక ప్రవచణ వేదిక కూడా ఉంటుంది. మేలు జాతి ఇటాలియన్‌ మార్బుల్‌ను ఫ్లోరింగ్‌కు ఉపయోగించారు. అత్యాధునిక వసతులతో ఒకవీవీఐపీ లాంజ్‌ ను కూడా నిర్మించారు.

భద్రవేది మొదటి అంతస్తు

ఇది భగవద్రామానుజా చార్యుల వారి సువర్ణమయ అర్ఛామూర్తి కొలువుండే స్థానం. దీనికి ప్రసన్న శరణాగత మంపడం అని పేరు. 120 సం॥ పరిపూర్ణ జీవితం అనుభవించిన రామానుజుల వారికి గుర్తుగా 120 కిలోల బంగారాన్ని ఉపయోగిస్తూ రూపొందించిన 54 అంగుళాల సువర్ణమయ రామానుజాచార్యుల వారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠింపబడుతుంది. శ్రీరామానుజుల వారికి నిత్య పూజలు, నిత్య అభిషేకం, నిత్య నైవేద్యాలు ఇక్కడూ జరుగుతాయి.  ఇందులో 48 స్తంభాలు నక్షత్రాకృతిలో కనువిందు చేస్తున్నాయి. ఆ స్తంభాలపైన 32 బ్రహ్మవిద్యల శిల్పాలు కనువిందు చేస్తుంటాయి. ఇది అష్టాశ్రమ ఆకృతిలో ఉంటుంది. ఇది 23,500 చ॥ అడుగుల విస్తీర్ణం. ఇందులో 36 అంగుళాల ఎత్తైన పీఠం మీద 34 అంగుళాల ఎత్తైన రామానుజాచార్యులు సువర్ణమూర్తి కొలువై ఉంటారు. శ్రీరామానుజాచార్యుల మీద పై కప్పుగా ఉండే పద్మాకృతిలో నిర్మించిన కప్పురాయి ఇంటర్‌ లాకింగ్‌ పద్ధతిలో అమర్చారు. ఈ ఫ్లోర్‌లో బంగారు రామానుజుల వారి చుట్టూ మకరానా మార్చుల్‌తో ఫ్లోరింగ్‌ పూర్తియింది. మిగతా ప్రాంతమంతా ఇటాలియన్‌ మార్బుల్‌తో ఫ్లోరింగ్‌ చేయబడిరది. స్తంభాల మీద ఉండే బ్రహ్మ విద్యల శిల్పాలను ఏఆర్‌ ఆగ్మంటెడ్‌ రియాలిటీతో అనుసంధానిస్తారు. బంగారు విగ్రహం మీద పంచవర్ణాల విద్యుత్‌ దీపాలు అమర్చారు.

భద్రవేది 2వ అంతస్తు

ఇది 16740 చ।7 అడుగుల విశాలమైన ప్రాంగణం. ఇందులో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు కాబోతున్నది. ఈ మొత్తం భద్రవేదిని బన్సీ పహడ్‌ పూర్‌ పింక్‌ స్టోన్‌ తో అలంకరించారు. ఇదిరాజస్థాన్‌లో దొరికే అందమైన ..? పూర్తిగా...? తో రూపొందించిన ఈ భద్రవేది ఉత్తర భారతదేశ శిల్పులతో నిర్మాణం కొవించబడిరది. ఈ నిర్మాణానికి సుమారు 2 లక్షల సీఎఫ్‌ఎస్‌ రాయిని ఉపయోగించారు.

భద్రవేది 3వ అంతస్తు

ఇక్కడ భగవద్‌ రామానుజుల వవారి శ్రీమూర్తి ఉంటుంది. ఇందులో 27 అడుగుల పద్మపీఠం ఉంటుంది. ఇందులో 36 ఏనుగులు, 108 పద్మదళాలు ఉంటాయి. ఈ పద్మపీఠం 108 అడుగుల వెడల్పులతో వృత్తాకారంలో ఉంటుంది. ఇందులోని ఏనుగులు తొండాల నుండి నీటిని విరజిమ్ముతూ ఉంటాయి. పద్మపీఠంపైన భగవద్‌ రామానుజుల వారి విరాట్‌ మూర్తి. శ్రీ రామానుజుల వారి శ్రీమూర్తి పాదాల నుండి శిరస్సు వరకూ 108 అడుగుల ఎత్తులో ఉంటారు. ఆ శిరస్సుపై నుండి త్రిదండం ఇంకో 27 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం త్రిదండం ఎత్తు 153 అడుగులు. త్రిదండం బరువు 60 వేల కిలోలు, త్రిదండంపైన ఉండే జలపవిత్రం (జెండా లాంటి ఆకృతి) 6 వేల కేజీల బరువుతో ఉంటుంది. ఆ జలపవిత్రం ఎత్తు 13 అడుగులు, వెడల్పు 18అడుగులు, వైశాల్యం 234 అడుగులు. శ్రీరామానుజుల వారి ఒక్కొక్క కన్ను ఎత్తు 3 అడుగులు, వెడల్పు 6 అడుగులు.  ముక్కు ఎత్తు 6 అడుగులు, వెడల్పు 5 అడుగులు. పెదవుల ఎత్తు 2 నుంచి 6 అడుగులు, వెడల్పు 6 నుంచి 9 అడుగులు. చెవి ఎత్తు 16 అడుగులు, వెడల్పు 4 అడుగులు. చెవి తమ్మెలోని రంధ్రం ఎత్తు 2 అడుగులు, వెడల్పు 9 అంగుళాలు,.. తులసి పూస ఎత్తు 1`6 అడుగులు, వెడల్పు 1 అడుగు. యజ్జోపవీతం ముడి ఎత్తు 5`3 అడుగులు, వెడల్పు 4`6 అడుగులు. యజోపవీతం ముడి ఎత్తు 63 అంగుళాలు, వెడల్పు 54 అంగుళాలు. మొత్తం యజ్ఞోపవీతం పొడవు 180 అడుగులు. ఒక్కొక్క దారం మందం 9 అంగుళాలు.

అంజలి

హస్తం ఎత్తు - 24 అడుగులు, వెడల్పు 12-6 అడుగులు. బొటన వేలు ఎత్తు `6`6 అడుగులు, మందం 2-6 అడుగులు. చూపుడు వేలు ఎత్తు 10-9 అడుగులు, మందం 2-3 అడుగులు. మధ్య వేలు ఎత్తు 11-6 అడుగులు, మందం 2-3 అడుగులు. ఉంగరపు వేలు ఎత్తు 10 అడుగులు, మందం 2-1 అడుగులు. చిటికెన వేలు ఎత్తు 7-0 అడుగులు, మందం 1-11 అడుగులు. తిరుమణి ఎత్తు -14 అడుగులు, వెడల్పు 8-6 అడుగులు.  పాదం ఎత్తు -10 అడుగులు పాదం బొటనవేలు పొడవు 6-0, మందం 3-6 అడుగులు. శ్రీ శఠారి ఎత్తు -18 అడుగులు. క్రింది వెడల్పు -15 అడుగులు. పై వెడల్పు 6-6 అడుగులు. అందులోని పాదుకుల పొడవు -3 అడుగులు, వెడల్పు 1-6 అడుగులు పద్మపీఠం చుట్టు కొలత 108 అడుగులు.

ఉజ్జీవన సోపాన మండపం

భద్రవేదిపైకి అంటే భగవద్‌ రామానుజల వారి విరాట్‌ మూర్తి సన్నిధికి తీసుకువెళ్లే మెట్లను ఉజ్జీవన సోపానాలు అంటారు. ఇవి మొత్తం 108. ఒక్కొక్కటి 6 అంగుళాల ఎత్తు ఉంటుంది. ప్రారంభంలో ఒక్కో మొట్టు వెడల్పు` చివరలో ఒక్కో మెట్టు వెడల్పు .

దివ్య దేశాల ఆలయాలు

శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి వారి సంకల్పనుసారము దివ్యదేశ ఆలయాల నమూనాలను రామానుజుల వారి చుట్టూ నిర్మించడం జరిగింది. సుమారు 5 లక్షల ..? రాయిని ఇందులో వినియోగించడం జరిగింది. తమిళనాడులోని కారైకుడి, శ్రీరంగం, మహాబలిపురం, ఆంధ్రప్రదేశ్‌ లోని తిరుపతి, ఆళ్లగడ్డ, పురుషోత్తమపట్నం తదితర ప్రాంతాల నుండి 1000 మంది శిల్పులు ఈ నిర్మాణాలలో భాగస్వాములైనారు. సుమారు 14 నెలలు శ్రమించి ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారు. 6 మంది స్థపతి కాంట్రాక్టర్లు ఈ ఆలయాల నిర్మాణంలో భాగస్వాములైనవారు. తొమ్మిది మందితో కూడా స్థపతి బృందం ఈ ఆలయ నిర్మాణాలను పర్యవేక్షించింది. మన సహస్రాబ్ది ప్రాంగణంలో పాటుగా తిరుపతి, మార్టూరు పరిసర ప్రాంతాలలో ఈ రాళ్లను చెక్కించి మన సహస్రాబ్ది ప్రాంగణంలో అమర్చారు.

దివ్య దేశ మండపం-దివ్య మండపం

అన్ని దివ్య దేశాలను కలుపుతూ నిర్మించిన మహామండపానికి దివ్య మండపం అన్ని పేరు. ఈ మండపం పొడవు -2619 అడుగులు, వెడల్పు -50 । 3 అడుగులు ( 606 అంగుళాలు) మొత్తం స్తంభాలు 468  స్తంభాల ఎత్తు 12-6 అడుగులు, వెడల్పు 2`9 అడుగులు, ఈ స్తంభాలన్నీ రాజస్థాన్‌లోని బీస్‌లానా అనే గ్రామంలో సేకరించిన నల్లని మార్బుల్‌తో తయారు చేయబడ్డాయి. ఇవన్నీ జైపూర్‌లో తయారు చేయబడ్డాయి. సుమారు 75,000 ఘనపుటడుగుల బ్యాక్‌ మార్బుల్‌ రాయి ఈ నిర్మాణంలో వినియోగించబడిరది. సుమారు 200 మంది ఉత్తర భారతదేశ శిల్పులు ఈ స్తంభాల తయారీలో పాలు పంచుకున్నారు.  దివ్య మండపం ముందుండే యాళీ, శుక ప్రతిమలు ఒక్కొక్కటీ 10-6 ఉండే ఈ యాళీ ప్రతిమలు బ్లాక్‌ మార్బల్‌తో రూపొందించబడ్డాయి.  ఇందు యాళీలు, -24 శుక యాళీలు -34 మొత్తం -58 ఈ మొత్తం దివ్య మండపం విస్తీర్ణం 1,88,500 చదరపు అడుగులు, ఆ మందర బ్యాటీ కార్‌ కోసం ఏర్పాటు చేసిన మార్గం మొత్తం 2,650 అడుగుల పొడవు మరియు 12-0 అడుగుల వెడల్పు కలిగి వుంది.

వాటర్‌ ఫౌంటెన్‌

108 అడుగుల వృత్తాకారంలో అమర్చిన అష్టదళ పద్మాకృతిలో వాటర్‌ పౌంటెన్‌ కొలువు తీరి ఉంటుంది. 8 రకాల జీవరాశులు ఇందులో కొలువైన ఉంటాయి.  ఒక సరీసృపం `పాము, జలచరం` చేప, ఉభయచరం ` మొసలి, భూచరం `గుర్రం, వాయుచరం `గ్రద్ద ` నెమలి ` దేవత,  మనుష్యుడు  ఇలా 8రకాల జీవరాశులు ఇందులో కొలువైన ఉండి జగద్‌ గురువులైన శ్రీ రామానుజులవారిని తమ ప్రేమ జలాలతో అభిషేకిస్తాయి. ఈ ఫౌంటేన్‌ను ఒక్కసారి నీటితో నింపాలంటే 1 లక్ష లీటర్ల శుద్ధమైన నీరు కావాల్సి వస్తుంది. ఈ ఫౌంటైన్‌లో పంపులు, వివిధ రంగుల్లో బల్బులు ఉన్నాయి. ఇందులో నక్ష త్రాకృతిలో ఉప పీఠం,ఆ ఉప పీఠంలో 8 సింహాలు ఉంటాయి. ఇవి తామస గుణానికి ప్రతీక. దానిపైన 8 ఏనుగులు ఉంటాయి. ఇవి రాజసానికి ప్రతీక, ఆ పైన వరుసలో 8 హంసలుంటాయి. ఇవి సత్యగుణానికి ప్రతీక. ఆపన తామర పుష్పంలో త్రిగుణాలకూ అతీతమైన ఆచార్చులైన శ్రీరామానుజాచార్యులుంటారు. ఆ స్థూపం మొత్తం 36 అడుగులు దానిపైన రామానుజులవారు మరో 4-6 అడుగులు ఉంటారు.

ప్రవేశ వాటిక, ఎంట్రీ బిల్డింగ్‌

ఇందులో కాకతీయ నిర్మాణ శైలిలో నాలుగు స్వాగత తోరణాలు దర్శనమిస్తాయి. వీటి ఎత్తు `30 అడుగులు, వెడల్పు 9`6 అడుగులు ఆ పక్కనే హంపీ రథాలు దర్శనమిస్తాయి. అతి ప్రాచుర్యం పొందిన విజయనగర సామ్రాజ్య ఆలయ నిర్మాణ శైలికి మచ్చు తునక హంపీ రథం. అయితే అవి ఇప్పుడు పైన విమాన గోపురం లేకుండా దర్శనమిస్తున్నాయి. 18,556లో తీసిన ఫొటోలు అధారం చేసుకొని విమాన సహితంగా ఈ రెండు రథాలు 31 అడుగుల ఎత్తులో చేయించడం జరిగింది. ఆ పక్కనే ఉన్న 46 అడుగుల ఎత్తైన మండపాలలో 18 అడుగుల శ్రీ ఆంజనేయ, శ్రీ గరుడ విగ్రహాలు కొలువైన ఉన్నాయి. ప్రవేశద్వారం, నిష్క్రమణ ద్వారాలలో ఎల్లోరా గుహల అర్కిటెక్చర్‌ తీసుకోవడం జరిగింది. ప్రాచీణ చోళ, పల్లవ శైలులతో గోపురాల నిర్మాణాలు జరిగాయి. ఇందులో సుమారు 2 లక్షల సిఎఫ్‌టి రాయిని ఉపయోగించారు. సుమారు 1,600 మంది శిల్లుపు భద్రవేది,, ప్రవేశవాటిక నిర్మాణాలకు సంబంధించిన పనులలో నిమగ్నమయ్యారు. వీరంతా రాజస్థాన్‌లో మౌంట్‌ అబూ పరిసర ప్రాంతాలకు చెందిన వారు. ఈ ప్రవేశ వాటిక ఎదురుగా సుమారు 4,680 మంది ఏకకాలంలో 3డీ మ్యాపింగ్‌ షో చూసేందుకు వీలుగా సీటింగ్‌ ఏర్పాట్లు. అందులోనే 50`3 అంటే 603 అంగుళాల ఎత్తులో ఉండే శ్రీ రామానుజుల  వారి  విజయ స్తంభం ప్రతిష్ఠింపబడిరది. ఇది సుమారు 77 టన్నుల బరువుండే రాయిని బెంగళూరు సమీపంలోని కృష్ణరాజపురం వద్ద సేకరించి తెచ్చారు. దాన్ని అందరినీ ఆకట్టుకునేటట్లు చెక్కగా 30 టన్నులుగా ఏర్పడిరది. అదే స్తంభాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము.

లాండ్‌ స్కేపింగ్‌

సుమారు 2 లక్షల పైచిలుకు మొక్కలతో సహస్రాబ్ది ప్రాంగణం అలకరింపబడి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇందులో సంపెంగ, గులాబీ, జాబి, బంతి, చేమంతి మొదలైన సువాసనలు వెదజల్ల మొక్కలు అందంగా, రంగవళ్లులు తీర్చిదిద్దినట్లు అలంకరించారు.

శ్రీరామానుజుల ధ్వజస్తంభం

చరిత్రలో మొట్టమొదటి సారిగా శ్రీ రామానుజుల వారికి ధ్వజస్తంభాన్ని శ్రీ చిన్న జీయర్‌ స్వామి వారు ప్రతిష్టించారు. శ్రీ రామానుజాచార్యులు అవతరించిన శ్రీపీఠంలోనూ, వారు పరమపదించిన శ్రీరంగంలోనూ వారికి ధ్వజస్తంభాలు లేవు. శ్రీ చిన్నజీయర్‌ స్వామి వారు స్థాపించిన ఈ ధ్వజస్తంభం 540 అంగుళాల ఎత్తులో ఉంది. నవగ్రహాలు, అక్ష మంగళాలు, ద్వాదశ రాశులతో కూడిన రూపాలను ఈ ధ్వజస్తంభం మీద తొడుగులా వేయిస్తున్నారు.  సుమారు 100 మంది ఇంజనీర్లు ఈ నిర్మాణపు వివిధ దశలలో పాల్గొన్నారు. లైటింగ్‌ ఏర్పాటులో బ్రిటన్‌ చెందిన డిజైనర్‌ సహకారం తీసుకున్నారు.

ఇలా ఎన్నో విశేషాలతో శ్రీ త్రిదండి శ్రీ చినజీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాటైన శ్రీ సమతామూర్తి విగ్రహం, దాని వెనుక ఉన్న కృషిని తెలుగుటైమ్స్‌ పాఠకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది.

 

Tags :