నాటాలో శ్రీనివాస కళ్యాణం
ఉత్తర అమెరికా తెలుగు సమితి మహాసభల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సహకారంతో శ్రీనివాస కళ్యాణం వేడుకను ఏర్పాటు చేసింది. జూన్ 2వ తేదీ ఉదయం 8 గంటలకు బాల్ రూమ్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆరోజు స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన కార్యక్రమాలతోపాటు శ్రీనివాస కళ్యాణం చేస్తారు. తిరుమల నుంచి వచ్చే వేదపండితులు, అర్చకుల చేతుల మీదుగా తిరుమలలో జరిగినట్లుగానే ఇక్కడ కూడా శ్రీనివాస కళ్యాణం జరిగేటట్లుగా ఏర్పాట్లు చేశారు. అలాగే స్వామివారి కళ్యాణం తరువాత తిరుమల నుంచి వచ్చిన లడ్డు ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, రవికెను కూడా కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు అందజేయనున్నారు. చైతన్య బ్రదర్స్ వారు సప్తగిరి సంకీర్తనలు ఆలపించనున్నారు.
ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనేవారు సంప్రదాయ వస్రధారణతో రావాలని నిర్వాహకులు కోరారు. పురుషులు ధోతీ లేదా పైజామా లాల్చి కండువాతో రావాలి. స్త్రీలు చీరలు లేదా హాఫ్ శారీ, లేదా చుడీదార్ దుప్పట్టాతో కళ్యాణోత్సవంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమానికి చైర్‌గా మల్లిక్ ఆవుల వ్యవహరిస్తున్నారు. కో చైర్స్‌గా హేమంత్ బల్ల, శ్రీకాంత్ రెడ్డి కొండ, రామ్మోహన్ అరెకూటి, కళ్యాణ్ భీమవరపు, అనూప్ దేవిరెడ్డి, హరి రెడ్డి సింగం, గాయత్రి గిరి, అర్పిత ఓబుల్ రెడ్డి ఉన్నారు. అడ్వయిజర్లుగా సుధ కొండపు, గౌతమ్ మియాపురం, గోపాల్ పొనంగి, డా. దర్గా నాగిరెడ్డి, జయచంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు. విజయ్ సాయి పెద్దసాని కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు.