న్యూయార్క్ లో ఆకట్టుకున్న శ్రీకృష్ణతత్వం ప్రవచనాలు
న్యూయార్క్ లోని మెల్‌విల్లేలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఏర్పాటు చేసిన శ్రీకృష్ణతత్వం ప్రవచన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ప్రముఖ సహస్ర అవధాని,సరస్వతీ పుత్రులు మేడసాని మోహన్ శ్రీ కృష్ణ తత్వంపై చేసిన ప్రవచనాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయని తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి చెప్పారు. తొలుత మహిళ చేసిన గణేశ, కృష్ణ కీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జే తాళ్ళూరి అందరికీ స్వాగతం పలికి మేడసాని మోహన్ నిర్వహించిన పంచ సహస్ర అవధానం, టీటీడి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆయన చేసిన కృషిని అందరికీ వివరించారు. పద్యాలతో, ప్రసంగాలతో మేడసాని మోహన్ చేసిన శ్రీ కృష్ణతత్వం ప్రవచనం అందరినీ సమ్మోహితులను చేసింది. చివరన ఆయన పాండిత్య ప్రతిభను కొనియాడుతూ చప్పట్లతో లేచి తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. నెహ్రూ చెరుకుపల్లి మోహన్ గారిని దుశ్శాలువతో సత్కరించారు. తిరుమలరావు, టీఎల్‌సిఎ ప్రెసిడెంట్ అశోక్ చింతకుంట, తానా న్యూయార్క్ రీజినల్ కో ఆర్డినేటర్ సుమంత్ రామ్‌సెట్టి, ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, శైలజ చల్లపల్లి, శంకర్ రాజ్‌పుట్, దిలీప్ ముసునూర్, పృథ్వీ చెరుకూరి, రావు వోలేటి, పవన్ దొడ్డపనేని, సత్య చల్లపల్లి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి తోడ్పడ్డారని జే తాళ్ళూరి తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.