ASBL Koncept Ambience

డిట్రాయిట్ లో శ్రీనివాస గోగినేని ప్రచార సభ సక్సెస్

డిట్రాయిట్ లో శ్రీనివాస గోగినేని ప్రచార సభ సక్సెస్

తానా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శ్రీనివాస గోగినేని తొలి ప్రచారాన్ని డిట్రాయిట్‌లో ఫిబ్రవరి 18వ తేదీన ఫర్మింగ్టన్‌ హిల్స్‌లోని సెయింట్‌ తోమా బాంక్వెట్‌ హాల్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిట్రాయిట్‌లో ఉన్న శ్రీనివాస్‌ మిత్రులతోపాటు తానా మద్దతుదారులంతా హాజరయ్యారు. దాదాపు 350 మందికిపైగా హాజరైన ఈ కార్యక్రమంలో ఎంతోమంది శ్రీనివాస గోగినేని అధ్యక్ష అభ్యర్థిత్వానికి తమ మద్దతును ప్రకటించారు. రెండురోజుల ముందు ఇచ్చిన ఈ పిలుపుకు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస గోగినేని చెప్పారు. తానా నీది నాది మనందరిదీ అనే నినాదంతో ఆయన బరిలో దిగిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్‌ ప్రచార సభకు అనేకమంది కుటుంబంతో సహా వేడుకలకు తరలి రావడం విశేషం. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ఈ సందర్భంగా శ్రీనివాస గోగినేని ధన్యవాదాలు తెలియజేశారు. 

 

Tags :