ASBL Koncept Ambience

తానా మహాసభల్లో శ్రీనివాస కళ్యాణం

తానా మహాసభల్లో శ్రీనివాస కళ్యాణం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వాషింగ్టన్‌ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న తానా మహాసభల్లో ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణంను జూలై 6వ తేదీ నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణం కోసం, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు.

ఈ కార్యక్రమానికి చైర్‌గా లక్ష్మీదేవినేని, ఆధ్యాత్మిక కమిటీ చైర్‌గా సుబ్బువారణాశి, కో ఆర్డినేటర్‌గా సుబ్బారావు చెన్నూరి వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గ్రాండ్‌ స్పాన్సర్‌గా పిఎంజె జ్యూవెల్స్‌ వ్యవహరిస్తోంది. గాయని సింగర్‌ ప్రత్యేక అతిధిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇతర వివరాలకు తానా మహాసభల వెబ్‌సైట్‌ను సందర్శించండి.

https://www.tana2019.org/

 

Tags :