ASBL Koncept Ambience

అత్యంత వైభవంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం

అత్యంత వైభవంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం

తానా మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస కల్యాణం కన్నులవిందుగా జరిగింది. ఈ వేడుక కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఒక అధికారి, ఐదుగురు పూజారులు, విగ్రహాలను తీసుకురావడం జరిగింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు శుప్రభాతంతో ఈ వేడుక మొదలైంది. ఇతరత్రా సేవలు కూడా చేసిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు సంప్రదాయబద్ధంగా, అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీనివాస కల్యాణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుక జరుగుతన్నంతసేపూ టీటీడీ విధివిధానాలకు తగ్గట్లు ‘లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ’ హెడ్ శ్రీ రామాచారి, 100 మంది చిన్నారులతో కలిసి అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ అలరించారు.

ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, శ్రీనివాస కల్యాణం చైర్ సుబ్రమణ్యం ఓసూరి దంపతులు పాల్గొన్నారు. కల్యాణం కమిటీ అడ్వైజర్ లక్ష్మీ దేవినేని అన్ని కార్యక్రమాల్లో పాల్గొని, ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. తానా మహాసభల్లో టీటీడీ పాల్గొనడంలో ఎంతో కృషి చేసిన ‘తెలుగు టైమ్స్’ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వేడుకల్లో టీటీడీ హుండీ ఏర్పాటు చేశారు. భక్తులందరికీ దర్శనం, తీర్థం, తిరుపతి లడ్డు ప్రసాదం అందజేశారు. భారత సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, తానా నాయకులు, తదితరులు ఈ వేదికపై శ్రీవారిని భక్తిప్రపత్తులతో దర్శించుకున్నారు. తానా మహాసభల్లో శ్రీవారిని 5 వేల మందికిపైగా భక్తులు దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Click here for Event Gallery

 

 

 

Tags :