తమన్ సంగీత విభావరి
టాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమన్ తమిళ సినిమాల్లో కూడా సత్తా చూపించి అక్కడ కూడా హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తమన్ పాడిన పాటలు హిట్టవడంతో గాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తమన్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సర్కారు వారి పాట మూవీతో సూపర్ హిట్ అందుకున్న తమన్.. ప్రస్తుతం గాడ్ ఫాదర్, రామ్‌చరణ్-15 చిత్రాలకు మ్యూజిక్ కంపోజర్‌గా పనిచేస్తున్నాడు. తమిళంలో కూడా చాలా చిత్రాలకు మ్యూజిక్‌ను సమకూర్చిన తమన్ అక్కడ కూడా కొన్ని చిత్రాల్లో పాటలను పాడి తమిళ ప్రేక్షకులను కూడా మెప్పించారు. తమిళం, తెలుగు భాషల్లో సంగీత దర్శకుడుటగా వెలుగొందుతున్న తమన్ తెలుగు ఓటీటీలో కూడా ఇండియన్ ఐడల్ పోటీలకు జడ్జిగా కూడా వ్యవహరించి మరింత పాపులర్ అయ్యారు. అమెరికా తెలుగు సంఘం వాషింగ్టన్ డీసిలోని వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న మహాసభల్లో బాంక్వెట్ డిన్నర్‌లో సంగీత విభావరిని తమన్ చేయనున్నారు.