ఈ ఎన్నికలు దేశానికి, ఏపీకి ఎంతో ముఖ్యమైనవి : క్రేజీవాల్
ఈ ఏడాదిలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనవని ఆప్ అధినేత, ఢిలీ సీఎం అరవింద్ క్రేజీవాల్ అన్నారు. చంద్రబాబు ఏపీని మోడర్న్ రాష్ట్రంగా మార్చారని, ఆయన మరోసారి సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖ లో నిర్వహించిన టీడీపీ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల ఎన్డీయే పాలనా విధానాలను ఎండగట్టారు. మోడీ, అమిత్‌షా కలిసి ఈ దేశంలో అనేక సమస్యల్ని సృష్టించారన్నారు. మోడీ పాలనలో అవినీతి చాలా పెరిగింది. దేశం మొత్తాన్ని వారిద్దరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
Tags :