తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సుబ్బు సుబ్రహ్మణ్యం బృందం
కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మద్దతుగా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సుబ్బు సుబ్రహ్మణ్యం బృందం....కుప్పంలోని నాలుగుమండలాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ విధానాలు, అమలు చేసిన పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నారు...నాలుగు కార్లను తెలుగుదేశం పార్టీ పసుపు రంగు అద్ది అందంగా తీర్చిదిద్ది ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన పట్ల ప్రజాభిప్రాయం భేష్ గా ఉందని సుబ్బు తెలిపారు...మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారే అధికారం చేపడతారన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉన్నదని ఎట్టిస్థితిలోనూ ఆయనను గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు...రాష్ట్రాన్ని గతంలో దోచుకుని, అరాచకాలకు పెట్టింది పేరైన వైకాపా అభ్యర్థులను ముఖ్యంగా జగన్ పార్టీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ గెలుపు, ప్రజల గెలుపుగా భావించి కృషీ చేస్తున్నామన్నారు...రాష్ట్రంలో సుబ్బులాంటి యువత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి స్పూర్తినిస్తారని ఆశించవచ్చు.