ASBL Koncept Ambience

నాట్స్‌ మహాసభల్లో స్వరవీణాపాణి సంగీతం

నాట్స్‌ మహాసభల్లో స్వరవీణాపాణి సంగీతం

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం పొంది భారతీయ సంగీత మూలాధారాలైన 72 మేళ కర్త రాగములలో పేరు గాంచిన స్వరవీణాపాణి సంగీత కచేరిని నాట్స్‌ సంబరాల్లో ఏర్పాటు చేశారు. స్వర కామాక్షి, అమ్మ పాటల గానామృతంతో ఆయన అలరించనున్నారు. 

 

 

Tags :