ASBL Koncept Ambience

కాలిఫోర్నియాలో ఘనంగా బతుకమ్మ పండుగ

కాలిఫోర్నియాలో ఘనంగా బతుకమ్మ పండుగ

కాలిఫోర్నియాలో ఫ్‌రెస్నో పట్టణంలో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టి.ఎ.టి.ఎ) ఘనంగా బతుకమ్మ మరియు దసరా పండుగ జరుపుకుంది. ఈ పండగకి 500 పైగా సభ్యులు పాల్గొనడం విశేషం. టి.ఎ.టి.ఎ అధ్యక్షులురాలు ఐన శ్రీమతి, ఝాన్సీ రెడ్డి సభ్యులను బతుకమ్మ మరియు దసరా పండుగకు ఆహ్వానించారు. సభ్యులను ఉద్దేసించి ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ఎంతో పూరతనమైన మరియు ఘన చరిత్ర కలిగిన పండుగ అని అన్నారు.

పూలతో చక్కగా ముస్తాబైన బతుకమ్మలు సభ్యులను ఎంతో ఆకర్షించాయి. బతుకమ్మ పాటలు,  నడుమా మహిళలు బతుకమ్మలను మధ్య లో పేర్చి ఆటా పాటా కొనసాగించారు. ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడుతూ టి.ఎ.టి.ఎ స్థాపించడానికి గల కారణాలను వివరించారు. ప్రవాస తెలంగాణ పౌరుల అవసరాలను చూడటం, తెలంగాణ సంస్కృతీ మరియు సాంప్రదాయాల పరిరక్షణ ముఖ్య ఉద్యేశామని పేర్కొన్నారు. టి.ఎ.టి.ఎ కి వెన్నుదండై నిలస్తున ఎల్ల వెళ్ళాలా సన్మార్గంలో ముందుకి తీసుకువేల్లుతున్న  పాలక మండలి సభాపతి ఐన డాక్టర్‌ పైళ్లా మల్లారెడ్డికి ధన్యావాదాలు తెలిపారు. కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులందరికీ అమె ధన్యవాదాలు తెలిపారు.

జూలై, 2017లో సాంటా క్లారా కన్వెన్షన్‌ హాల్‌ లో జరగనున్న మొదటి టి.ఎ.టి.ఎ  కన్వెన్షన్‌కి అందరిని పేరుపేరునా ఆహ్వానించారు. తెలంగాణ రుచులు మరియు సంస్కృతులను ప్రతిబింబించేలా కన్వెన్షన్‌ ఉండబోతుందని అని హామీ ఇచ్చారు. 


Click here for Event Gallery

 

Tags :