ASBL Koncept Ambience

వెలుగులు పంచిన టాకో దీపావళి

వెలుగులు పంచిన టాకో దీపావళి

సెంట్రల్‌ ఒహాయొ తెలుగు సంఘం (టాకో) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 26న, శనివారం నాడు వెస్టర్విల్‌  నార్త్‌ హైస్కూల్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్షాన్నీ, చిరుచలిని అధిగమించి 1200 మందికి పైగా కొలంబస్‌ తెలుగు ప్రజలు ఈ వేడుకకు హాజరయ్యారు.

టాకో అధ్యక్షులు ఫణి భూషణ్‌ పొట్లూరి జ్యోతి ప్రజ్వలనతో మొదలైన వేడుకలు ఉదయం 11 గంటలనుండి రాత్రి 11 గంటలవరకు నిర్విరామంగా ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాయి. తెలుగు సంస్కతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసే టాకో సంఘం కూచిపూడి, భరతనాట్యం వంటి కళాప్రదర్శనలు, ''బాబు బంగారం'' వంటి సాంఘిక హాస్య నాటకంతోపాటు అనేక సంగీత నాట్యప్రదర్శనలకు వేదికగా నిలిచింది. 50కి పైచిలుకు కార్యక్రమాలు, 300కి పైగా చిన్నారులు, పెద్దలు పాల్గొన్నారు.

ప్రముఖ సినీనటి/గాయని స్నిగ్ధ, పాడుతా తీయగా విజేత ప్రవీణ్‌, అమెరికా ఆడపడుచు / గాయని శతి ముఖ్య అతిధులుగా విచ్చేసి వారి గానంతో, నటనతో శ్రోతలను మైమరపించారు. వీరితోపాటు నటి/వ్యాఖ్యాత మధు నెక్కంటి తన మిమిక్రితో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. మొత్తానికి టాకో వారు అనేక రకాల వంటకాలతో కడుపుని, ఉత్సాహభరితమైన కార్యక్రమాలతో మనస్సుని నింపారు.

ఈ వేడుకలో భాగంగా టాకో అధ్యక్షులు ఫణి ఏఐఏ  సంస్థ నుంచి ఒహాయో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సంజయ్‌ సాదానాను ఘనంగా సత్కరించారు. అలాగే టాకోకి ఎప్పుడూ ధారాళంగా విరాళలందించే దాతలను కూడా గౌరవంగా ప్రశంసించారు.

2019 టాకో అధ్యక్షులు ఫణి పొట్లూరి 2020 టాకో కమిటీ అయిన జగన్నాథ్‌ చలసాని, కాళీ ప్రసాద్‌ మావులేటి, దశరధరామ్‌ గద్దె, ఉష శాఖమూరు, రాజ్‌ వంటిపల్లి, సంపత్‌ నాలం, విజయ్‌ కాకర్ల, అనిల్‌ బ్యాడిగెర, వేణు అబ్బూరి, రామ్‌ సానేపల్లి, వినోద్‌ యడ్లపల్లి,సత్య మర్రే, ప్రదీప్‌ గుంటక, శ్రీ దిత్య అట్లూరి, ప్రవీణ్‌ కుమార్‌ అంకం, రాజేష్‌ చెరుకూరి, భాను పొట్లూరి, శ్రీవర్షిణి ముద్దులూరు, తేజశ్వని కంచరపల్లి, ప్రదీప్‌ చందనం, నీలిమ యలమంచలి, జయ మేడిది, విక్రమ్‌ రాచర్ల, కీర్తి కౌశిక్‌ తరణి, అన్వేష్‌ పెండ్యాల, ఊహ కాట్రగడ్డ, రమ ప్రత్తిపాటి, చిరంజీవి సమ్మెటలను సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించి శ్రోతలకు పరిచయం  చేశారు. అలాగే 2021 సంవత్సరానికి టాకో అధ్యక్షునిగా  ఏకగ్రీవంగా ఎన్నికైన శివ చావా గారిని కూడా ఆహ్వానించారు.

ఈ దీపావళి వేడుక బాగా జరగడానికి సహకరించిన స్వచ్ఛందసేవకులకు టాకో బందమైన ఫణి భూషణ్‌ పొట్లూరి, జగన్నాథ్‌ చలసాని, శ్రీనివాస్‌ పరుచూరి, స్వామి కావలి, హర్ష కామినేని, హారిక కొమ్మూరి, సుధీర్‌ కనగాల, వీణా  కామిసెట్టి, సరితా నందిమల్ల, శ్వేత, రచన బుక్క, సిద్థార్థ రేవూరు, ప్రదీప్‌ కుమార్‌, సంధ్య కనక, విజయ్‌ కాకర్ల, వేణు అబ్బూరి, రామ్‌ గద్దె, రాజ్‌ వంటిపల్లి, ప్రతాప్‌ కంతేటి, శివ చావా, ప్రదీప్‌ గుంటక, శ్రీ వర్షిణి ముద్దులూరు, సుభాషిణి సదనాల,శ్రీలత రేవూరు, కోటేశ్వర బోడిపూడి, ప్రసాద్‌ కండ్రు, రమేష్‌ కొల్లి, శ్రీకాంత్‌ మునగాల ధన్యవాదాలు తెలిపారు.

Click here for Event Gallery

 

Tags :