అంబరాన్ని అంటిన టాకో వారి సంక్రాంతి వేడుకలు
సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో) వారు ఫిబ్రవరి 8న, వెస్తెర్విల్లె నార్త్ హై స్కూల్ లో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా జరిపించారు.
ఈ సంక్రాంతి వేడుకను టాకో అధ్యక్షులు జగన్నాథ్ చలసాని గారు దీప ప్రజ్వలనతో ఆరంభించారు. నీలిమ యలమంచలి గారి నాయకత్వంలో 2020 కమిటీ సభ్యులు కాళీ ప్రసాద్ మావులేటి, సుధీర్ కనగాల, అపర్ణ కోనంకి, ఉష శాఖమూరు, శివ చావా, రాజ్ వంటిపల్లి, సంపత్ నాలం, విజయ్ కాకర్ల, అనిల్ బ్యాడిగెర, వేణు అబ్బూరి, రామ్ సానేపల్లి, వినోద్ యడ్లపల్లి, సత్య మర్రే, ప్రదీప్ గుంటక, శ్రీదిత్య అట్లూరి, ప్రవీణ్ కుమార్ అంకం, రాజేష్ చెరుకూరి, భాను పొట్లూరి, శ్రీవర్షిణి ముద్దులూరు, తేజశ్వని కంచరపల్లి, ప్రదీప్ చందనం, జయ మేడేది, విక్రమ్ రాచర్ల, కీర్తి కౌశిక్ తరణి, అన్వేష్ పెండ్యాల, ఊహ కాట్రగడ్డ, రమ ప్రత్తిపాటి, చిరంజీవి సమ్మెట, సహాయంతో చక్కగా కన్నులపండుగగా సంక్రాంతి కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి అసోసియేట్ జస్టిస్, సుప్రీమ్ కోర్ట్ ఒహియోర్ పాట్రిక్ డివైన్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. వేడుకలో భాగంగా ప్రముఖ దంత వైద్యురాలు అపర్ణ సాదినేని గారిని ఘనంగా సత్కరించారు.
చల్లటి శీతాకాలంలో చక్కటి కార్యక్రమాలని చూడటానికి 1200 మందికి పైచిలుకు కొలంబస్ ప్రజలు తరలి వచ్చారు. 40 పైగా కార్యక్రమాలు, 400 పైగా పిన్నలు పెద్దలు పాల్గొన్నారు. ఆకాశ వీధిలో అందాల జాబిలి (మహానటి సావిత్రి గారి నివాళి), సఖి ఫ్యాషన్స్ వారి ఫ్యాషన్ షో, ప్రముఖ టి.వీ నటీమణి, కూచిపూడి నర్తకి జ్యోతి రెడ్డి గారి "శ్రీ శ్రీనివాస కళ్యాణం" కూచిపూడి నాట్యం, వాలెంటైన్ డే స్పెషల్, అరవింద్ గారి మేజిక్ షో, దీపక్ భార్గవ్ గారి హాస్యనాటిక "అల ఆఫీసులో" మొదలైన ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. సూపర్ సింగర్ గాయని గాయకులైన హనుమాన్ గారు మరియు స్వాతి గారు తమ పాటలతో శ్రోతలను అలరించారు.
సంక్రాంతి వేడుకల సందర్భంగా టాకో వారు పిల్లలకి "మేజిక్ " పోటీలు మరియు "మహానటి సావిత్రి" గారి నటనను అనుకరించుటకు "టిక్ టాక్" పోటీ నిర్వహిoచారు. సావిత్రి గారి నటనతో పిల్లలు, పెద్దలు అనేక "టిక్ టాక్" వీడియోలు చేసి పంపటం విశేషం. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి టాకో ట్రస్టీలు శ్రీలత రేవూరు, జ్యోతి దండు, ఫణి భూషణ్ పొట్లూరి, కోటి బోడెపూడి, సుబ్బారెడ్డి కోవూరు, బహుమతులు ప్రధానం చేశారు.
రుచికరమైన చక్కటి విందు భోజనం తో, వందేమాతరం పాటతో (45 మంది పైగా పిల్లలు పాడటం విశేషం) సంక్రాంతి వేడుకను ముగించారు.