ఘనంగా టాంప బే సంక్రాంతి సంబరాలు
టాంప బే తెలుగు వారు సంక్రాంతి సంబరాలు జనవరి 23 న జరుపుకుంటున్నారంటే, దిక్పాలకులు, అశ్వినీ దేవతలతో సహా సంబరపడిపోయి హేమెంత ఋతువు లో వచ్చే భోగి దినం లాగా, టాంప వాతావరణాన్ని ఓ చిరు చలితో చల్లబరి చేసారు.
ముగ్గుల పోటీకని వాకిట వేసిన అందమైన ముగ్గులతో, ఈ సంబరాలకేనని ఇంటిలో జాగ్రత్తగా పెంచి తెచ్చిన ఏపైన చెరుకు గడలతో, బంతి పూలతో, హడావిడిగా ఆనందంగా పట్టు వస్త్రాలతో తిరుగుతున్నా వారితో ICC హాలు తెలుగిల్లుగా మారిపోయింది.
బసవన్న కట్ ఔట్ ముందు హరిదాసు, డూ డూ బసవన్నల వేషాలలో ఉన్న కమిటీ సభ్యులు ఆహ్వానితులకు స్వాగతం పలకడం వారితో ఫోటోలు దిగడం అందని ఎంతో ఆకట్టు కుంది, ఆ రోజు జరిగిన కార్యక్రమానికి పాస్కో కౌంటీ కమిషనర్ మైక్ మోర్, ముఖ్య అతిధి గా విచ్చేసారు. సమావేశానికి వచ్చిన పిల్లలందరిని వేదికపైకి పిలిచి వీరే మన భవిష్యత్తు అని చెప్పడం అందరికి నచ్చింది.
గణెశారాధనతో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల నృత్యాలు, పాటలతో గంటలు నిమిషాలుగా గదిచిపోయాయి. ఇంతదూరం వచ్చినా కర్నాటక సంగీతం, కూచిపూడి భరత నాట్యాలపై కృషి చేసీ ఇలాంటి సంబరాలలో ప్రదర్శించడం ఎంతో ముదావహం సతీ సావిత్రి వీధి నాటకం, ఆ నాటిక లో ని పద్యాలు, ఉపయోగించిన ప్రాప్స్ పిల్లలని పెద్దలను బాగా ఆకట్టు కున్నాయి.
చెన్నై వరద బాదితులకని ఈ సందర్బంగానే ఓ రాఫీల్ నడిపి $$$ తెలుగు సంఘం సేకరించ గలిగింది. ఆలానే, టాంప బే తెలుగు సంఘం 'తెలుగు సాహితి' అన్న వార్షిక పత్రిక ఉగాదికి విడుదల చేయాడానికి పనిచేస్తున్నదని , ఆ సంచికకు కథలు, కవితలు బొమ్మలు పంపించి సభ్యులు జయప్రదం చేయాలని ప్రకటించడం జరిగింది.
దాదాపు నాలుగు గంటలు జరిగిన ఈ కార్యక్రమం ఎ మాత్రం విసుగు కలుగకుండా రక్తి కట్టించింది డల్లాస్ నుండి వచ్చిన సూత్రధారి రాజశ్వరి ఉదయగిరి. ఈవిడ ఇంతకు ముందే మా టివి, జెమినీ టి వి లకు ఆంకర్ గా పనిచేయడం వల్ల అందరికి పరిచితులే.
ఈ సంబరాలకు వచ్చిన వారికి, స్నాక్స్, డిన్నర్ లు తెలుగు వారి పండుగ భోజనాలు గుర్తుకు తెచ్చాయి.
సంబరాల చివర అందరు కమిటీ సభ్యులు వేదికపై వచ్చి తమ కృతజ్ఞతలు చెప్పడం, జాతీయ గీతం జన గణ మన పాడడంతో ముగిసింది.
అబ్బ ఇంత మంచి పండుగ అప్పుడే అయిపోయిందన్న ఆలోచనతో టాంప బే తెలుగు వారి మనస్సు ఒక్క క్షణం చివ్వుక్కుమన్నా రాబోయే ఉగాదిని తలచుకొని ఆ ఎదురు చూపుల ఆనందాలలో మునిగిపోయారన్న దాంట్లో సందేహం ఏ మాత్రం లేదు. దానికి టాంప బే తెలుగు సంఘం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కృషి యే కారణం. వారి కృషి అభినందనీయం.
తెలుగు అసోషియేషన్ ఆఫ్ ఫ్లారిడా, టాంప బే కార్యవర్గాన్ని ఈ విధంగా అధ్యక్షురాలు నీరజ జాస్తి, సహ అధ్యక్షుడు భానుప్రకాష్ ధూళిపాళ, కార్యదర్శి శ్రీనివాస కొమ్మినేని, సహా కార్యదర్శి ప్రహ్లాద మాడభూషి,కోశాధికారి గాంధి నిడదవోల , విష్ణు కోటం రెడ్డి (ఫండ్ రైజింగ్ ), చందు తల్లా (పబ్లిక్ రిలేషన్స్), అనిల్ మండవ(వెబ్), శివ పంగులూరి (ఫుడ్), శ్యాం తంగిరాల (కల్చరల్) మరి ఇంకా ఎంతోమంది వాలంటీర్ల వల్లే ఇలాంటి జనరంజక కార్యక్రమము వీలు పడింది'.