ASBL Koncept Ambience

కోలాహలంగా జరిగిన టీఎజిబి సంక్రాంతి సంబరాలు

కోలాహలంగా జరిగిన టీఎజిబి సంక్రాంతి సంబరాలు

ఎప్పటిలానే రంగుల రంగవల్లికల తోరణాలతో, బొమ్మల కొలువుల, పల్లె సాంప్రాదాయాల, గంగిరెద్దుల అమరింపులతో, ముచ్చటైన పట్టుచీరల రెపరెపలతో, హాస్యపు అభిమానాల పలకరింతలతో మన TAGB, సంక్రాంతి  సంబరాలను బోస్టన్‌ నగరవాసుల ముంగిట వుంచేసింది. జనవరి 23, 2016 శనివారం అందరికి వీలుగా మాల్‌బరో నగరపు మిడిల్‌ స్కూల్లో మధ్యాన్నం 1.30 కల్లా మంచు  పడుతుందన్నా లెక్కచేయక, తగిన జాగర్తలతో విచ్చేసి ప్రాంగణాన్నంతా కళకళలాడి చేసారు బోస్టన్‌ చుట్టుపక్కల ప్రజానీకం.

మునుముందుగా మన సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి సత్యపరకాలగారు అందరికి సాంప్రదాయ పద్దతిలో స్వాగత తోరణాల పలకరింపుల చిలకరింపులతో కార్యక్రమం కాలాతీతమవ్వకుండా మొదలుపెట్టించి, ఆపైన కమిటీ సభ్యులందరూ కలిసి కూర్చిన కదంబమాల వంటి పలు వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిరవధికంగా 6 గంటల పాటు పిన్న పెద్దలను అలరించాయి.

పలుకే బంగారమాయెనా అనికొందరు చిన్నారులు రాగయుక్తంగా ఆలపిస్తే, మరికొందరు పిల్లలు పలుచిత్రాల పాటల మేళవింపుల మెడ్లీను నయనానందభరితంగా నృత్యాలను చేసేరు. ప్రజ్ఞజట్టు అనేక శ్లోకాలతో, విష్ణు సహస్రనామ శ్లోక అవధానాలతోఅలరిస్తే,  ఇంకా పరిసర ప్రాంతాల నృత్యకళాశాలల విధ్యార్ధులు అనేక శాస్త్రీయ నృత్యాలతో వీక్షకులను నయనాననంద భరితులను చేసారు. మరివీటితో పాటుగా చిత్ర గానాలాపనలు, స్థానిక ఇంద్రజాలికుల మాయగారడీల చిత్రాలు ఇలాఎన్నో. ఇక ఆసాయింత్రపు కార్యక్రమాలకు తలమానికమా అన్నట్టు 'అన్నమయ్య జీవితచరిత్ర' సంగీత నృత్యరూపకం శ్రీమతి పద్మజ, శ్రీ శ్రీనివాస్‌ బలపద్రపాత్రుని జంట నిర్వహణలో శ్రీమతి శైలజచౌదరి తుమ్మలగారి కొరియోగ్రఫీతో సుమారు గంటన్నరపాటు ప్రేక్షకులను కదలనివ్వకుండా అలరింపచేసింది.

ఇక ఆకార్యక్రమాన్ని యాంకరింగ్‌ చేసిన చిన్నారులు జస్విదోగిపర్తి, వింధ్య రాచురు, పెద్దలు పద్మ ధవళ, స్వప్నపుట్ట, కృష్ణవెంపటి, జగన్‌ మైనేని, రవిమేకల ఇంకా అనేక కార్యవర్గపు బృందం, కార్యక్రమాలతో పోటాపోటీగా తమవంతు సహకారాన్ని అందించి కార్యక్రమాన్ని ఆసాంతం రక్తి కట్టించేరు.

మధ్య మధ్యలో BOT, EC, Cultural, Sports, Front Desk, Audio, Competitions, Food, E-patrika కమిటీలను పరిచయం చేయగా, వారుకూడా సంక్రాంతి సాంప్రదాయపుబద్ద కోలాటాలతో సభ్యులకు స్వాగతమిచ్చారు. 

చివరిగా BOT చైర్మన్ ప్రకాష్‌ రెడ్డి అధ్యక్షుడు శ్రీశంకర్‌ మాగాపుగారు సంవత్సరమంతా కమిటీ విజయవంతంగా ముందుకు సాగటంలో అవిశ్రాంతంగా తోడ్పడిన కమిటి సభ్యులకు ధన్యవాదాలను అందించారు. శ్రీశ్రీనివాస్‌ బచ్చుగారు విచ్చేసిన ప్రేక్షకులకు, స్పాన్సర్స్‌కు, వాలంటీర్స్‌కు ఇంకా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పటంతో కార్యక్రమం ముగించి అటుపైన కమ్మని విందులతో సంక్రాంతి కోసం ప్రత్యేకంగా తెప్పించిన అరిసెలు, లడ్డులతో విందు ముగించారు.      


Click here for Event Gallery

 

Tags :