ASBL Koncept Ambience

బోస్టన్‌లో సంక్రాంతి వేడుకలు...పోటీలు...కళా ప్రదర్శనలు

బోస్టన్‌లో సంక్రాంతి వేడుకలు...పోటీలు...కళా ప్రదర్శనలు

బోస్టన్‌లో సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక బోస్టన్‌ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం (టీఎజిబి) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఫిబ్రవరి 1వ తేదీన జరిగిన వేడుకల్లో దాదాపు 500 మందికిపైగా తెలుగువారు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలు జరిగిన ప్రాంతం సంక్రాంతివాతావరణాన్ని తలపించేలా అందంగా అలంకరించారు. గంగిరెద్దు, హరిదాసు, గాలిపటాలు, గ్రామీణనేపథ్యం తలపించేలా అలంకరించారు. వేడుకలను పురస్కరించుకుని వివిధ పోటీలను నిర్వహించారు. స్టోరీ టెల్లింగ్‌ పోటీల్లో ఎంతోమంది చిన్నారులు పాల్గొన్నారు.

సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా 35 రకాల కార్యక్రమాలను ప్రదర్శించారు. దాదాపు 200 మంది తమ కళానైపుణ్యాలను ఇందులో ప్రదర్శించారు. చిన్నారులకు సంప్రదాయబద్ధంగా భోగిపళ్ళను పోశారు. భారత వేదముగా, శివస్తుతి, దేవి, పుత్తడి బొమ్మలు ఇలా ఎన్నోరకాల నృత్యరూపకాలను సంక్రాంతి వేడుకల్లో ప్రదర్శించారు. రేఖ అవ్వారు టీమ్‌ నిర్వహించిన ఫ్యాషన్‌ షో, ఆంధ్ర, తెలంగాణ జానపద నృత్యాలు, త్యాగరాజ కీర్తనల గానం వంటివి అందరి ప్రశంసలు అందుకున్నాయి. బెర్క్‌లీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ స్టూడెంట్స్‌ చేసిన మ్యూజికల్‌ ఢమాకా అదిరింది. ప్రియాంత్‌ సుందాస్‌ (గిటార్‌, సాయి రమణ్‌ (తబ్లా), జార్జియో అల్బనీస్‌ (అకార్డిషన్‌), నారియోజిదన్‌ (సాక్సోఫోన్‌) ప్రదర్శించిన మ్యూజిక్‌ అందరినీ ఆకట్టుకుంది. సంస్థకు సేవలందించిన పలువురిని టిఎజిబి నాయకులు సత్కరించారు. సుశీల మైత్రేయి (రిజిస్ట్రేషన్‌), విజయ తళ్ళం (డెకరేషన్‌), కిరణ్మయి చతుర్వేదుల (కల్చరల్‌), రవీంద్ర మేకల (ఫుడ్‌), రవీంద్ర పాముజుల (స్పోర్ట్స్‌) రామయ్య దర్భముల్ల (స్పోర్ట్స్‌) తదితరులను సత్కరించారు.

ఈ వేడుకల్లోనే 2020-21 కొత్త టీమ్‌ను కూడా అందరికీ పరిచయం చేశారు.

రామకృష్ణ పెనుమర్తి (ప్రెసిడెంట్‌), సుధ ముల్పూర్‌ (సెక్రటరీ), వెంకట్‌ పప్పల (ట్రెజరర్‌), రమణ దుగ్గరాజు (ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌), దీప్తి కొరిపల్లి (కల్చరల్‌ సెక్రటరీ), సారథి వల్లూరు (జాయింట్‌ సెక్రటరీ), శ్రీనివాస్‌ గొంది (జాయింట్‌ ట్రెజరర్‌)లను పరిచయం చేశారు.

రమేష్‌ తల్లం (చైర్మన్‌), కృష్ణ కోదెబోయిన, చంద్ర కమ్మ, సురేందర్‌ మాదాడి, పద్మ పరకాల, కృష్ణ మాజేటి, సీతారాం అమరవాది బోర్డ్‌ ట్రస్టీలుగా వ్యవహరించనున్నారు.

Click here for Event Gallery

 

Tags :