TAGKC ఆద్వర్యం లో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు
అమెరికా లోని కాన్సస్ నగరం లో తెలుగు అసోషియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సస్ సిటి (TAGKC) ఆద్వర్యం లో స్తానిక Blue Valley Northwest High School లో ఇటివల ఘనంగా దసరా, దీపావళి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమం లో దాదాపు వెయ్యి మంది తెలుగు వాళ్లు పాల్గొన్నారు. Program Committee Chair విశేషు రేపల్లె స్వాగతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. శ్రీకాంత్ రావికంటి మరియు జాహ్నవి వడ్దిపర్తి లు వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు. సాంప్రదాయ బద్దంగా, ప్రార్తనా గీతం తో మొదలై, చక్కని జానపద, శ్రాస్త్రీయ నృత్యాలు మరియు సినిమా సంగీత నృత్యాలు ప్రేక్షకులకు ఉత్సాహం తెప్పించాయి. మద్య మద్య లో చక్కని పాటలను స్తానిక గాయనీ గాయకులు పాడి మైమరిపించారు. చిన్న పిల్లలే కాకుండా, పెద్ద వాళ్లు కూడా ఎంతో చక్కని నృత్యాలను ప్రదర్శించారు. సెల్ ఫోన్ వ్యసనం పైన పిల్లలు చేసిన మైమ్ షో అందరిని ఆకట్టుకుంది.
పెద్ద వాళ్లు చేసిన Tribute to Sridevi, Megastar dances, యూత్ చేసిన Rocking Starts చూసి బాగ ఆనందించారు. పాటలు, నృత్యాల తో పాటు పిల్లలు చేసిన live orchestra ప్రత్యేకంగా నిలిచింది. వీటి అన్నింటి తో పాటు నాటకాన్ని గుర్తుకు తెచ్చేలా వ్యాఖ్యాత చెప్పిన యమదోంగ లోని ఎమంటివి dialog మరియు తెలుగు పైన చెప్పిన పద్యాలు ప్రశంసలు అందుకున్నాయి. Raffles లో గెలుచుకున్న వారికి, బహుమతు లను ఉపాధ్యక్షులు శివ తీయగూరు మరియు కార్యదర్శి వంశి సువ్వారి లు ఇచ్చారు. దాదాపు 40 మంది చేసిన fashion show కార్యక్రమానికే highlight గా నిలిచింది. దాని తరువాత అధ్యక్షులు సురేశ్ గుండు చెప్పిన vote of thanks, జనగనమన లతో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. చివర గా చక్కని తెలుగు బోజనం చేస్తూ అందరూ పండుగ ని కలిసి చేసుకున్నారు. కార్యక్రమం కి సహాయ పడ్ద అందరికి TAGKC Executive Committee కృతజ్ణతలు తెలిపింది.