టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సన్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో Olathe South హైస్కూల్లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ కాన్సన్ సిటీ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న తెలుగువారందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సంవత్సరం అందరికి శుభాలు కలగాలని కోరుకుంటూ అందరికి ఉగాది పచ్చడి, పానకాలను పంపిణీ చేశారు. ప్రధాన కార్యదర్శి సురేష్ గుండు సదస్సుని ఉద్దేశించి ప్రసంగించడంతో, ఆ తరువాత పూజారి గారి పంచంగ శ్రావణం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది.
ఈ సందర్భంగా ఏడు గంటలపాటు 150 మంది స్థానిక కళాకారులు ఇచ్చిన 25 ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భం గా 2016 సంవత్సరపు అధ్యక్షలు శ్రీకాంత్ రవికంటి, 2016 కార్యవర్గాన్ని మరియు 2016 ట్రస్ట్ బోర్డ్ ని సభ కి పరిచయం చేసారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన వివధ పోటిలలో రాష్టస్తాయిలో ప్రతిభచూపెట్టిన విద్యార్థులను సత్కరించారు. ఆ తరువాత చక్కని తెలుగు భోజనాలను అందరు ఆరగించి ఆనందించారు. కొస మెరపుఏమిటి అంటే 3 కార్యక్రమాల తరువాత ఫైర్ అలారం curtain trigger అవడం తో కార్యక్రమానికి ఇబ్బంది కలిగినా పిల్లలు, పెద్దవాళ్ళు, నేర్పించిన టీచర్లు అందరు కలిసి సహాయం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.