ASBL Koncept Ambience

ఆహూతులను ఎంతో అలరించింన మౌర్యచరితం పద్యనాటకం

ఆహూతులను ఎంతో అలరించింన మౌర్యచరితం పద్యనాటకం

మన జానపదాలు అజరామరం అని చాటే విధంగా ... మన చరిత్రను కళ్ళముందు ఎంతో ఘనంగా చూపుతూ అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం లోని ఓర్లాండో ఉగాది వేడుకలలో ప్రదర్శించిన మౌర్యచరితం పద్యనాటకం ఆహూతులను ఎంతో అలరించింది. బుర్రకథను పద్యనాటకాన్ని కలుపుతూ తయారు చేసిన కథనం, కథనానికి ధీటుగా సంభాషణలు, సంభాషణలకు ప్రాణం పోసిన పద్యాలు ప్రవాస యువకవి తటవర్తి శ్రీకళ్యాణ్ చక్రవర్తి కలం నుండి జాలువారి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

చాణక్య పాత్రలో శ్రీ శర్మమొదలి గారు పాత్రకి ప్రాణప్రతిష్ట చేస్తే, చంద్రగుప్తమౌర్యుని‌ పాత్రలో శ్రీ శాయిప్రభాకర్ యఱ్ఱాప్రగడ గారి అభినయం ఒక కొత్త ఒరవడి సృష్టించే విధంగా సాగింది. గ్రీకు చక్రవర్తిగా శ్రీ ఈశ్వర్ కనుమూరి గారి అభినయం నభూతోనభవిష్యతి అన్నరీతిలో సాగింది.

నాటకాన్ని నడిపించే విధంగా సాగిన బుర్రకథా గానాన్ని చంద్రశేఖర్ అయ్యలరాజు, సత్యమంతెన మరియు కళ్యాణ్ తటవర్తి ఎంతో చక్కగా చేసారు. శబ్దదర్శకత్వం, కూర్పు చేసిమ రవి ఖండవిల్లిగారిని అందరూ ఎంతో ప్రశంసించారు. సంగీతం శిరీష ఖండవిల్లి మరియు జాహ్నవీ తటవర్తి.

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కొత్తతరహా పద్యనాటకాలు మరింత రావాలి, భాషను సుసంపన్నం చేయాలని ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో తమ కరతాళధ్వనులద్వారా తెలిపారు.

Click here for Event Gallery

 

Tags :