ASBL Koncept Ambience

నింగికెగసిన 'తామా' దివ్య దీపావళి తారాజువ్వలు

నింగికెగసిన 'తామా' దివ్య దీపావళి తారాజువ్వలు

నవంబర్ 9న అట్లాంటా తెలుగు సంఘం 'తామా' దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శేఖర్ రియాల్టీ, జార్జ్ మెలత్ మోర్ట్ గేజ్ & ఇన్సూరెన్స్, ట్వంటీ సెవెంత్ ఇన్వెస్ట్మెంట్స్, గోదావరి రెస్టారెంట్, ఎస్.వి.కె సిస్టమ్స్, గిరీష్ మోడీ మరియు పటేల్ బ్రదర్స్ సమర్పించిన ఈ వేడుకలకు సుమారు 1000 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. నార్క్రాస్ లోని స్థానిక మేడోక్రీక్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫోర్సైత్ కౌంటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ క్రిస్టీన్ మోరిస్సి మరియు ఫోర్సైత్ కౌంటీ డిస్ట్రిక్ట్ 2 కమీషనర్ డెన్నిస్ బ్రౌన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ముందుగా పిల్లలకి క్యూరీ లెర్నింగ్ సెంటర్ వారు వ్యాస రచన పోటీలు మరియు యూత్ టెక్నాలజీ లెర్నింగ్ సెంటర్ వారు లెగో పోటీలు నిర్వహించగా, సుమారు 175 మంది బాలబాలికలు పాల్గొన్నారు. లెగో పోటీలలో పిల్లలు ఎంతో వినూత్నంగా తమ సృజనాత్మకతను వెలికితీయడం విశేషం. తదనంతరం ప్రముఖ తెలుగు సినీ గాయనీగాయకులు లిప్సిక, యాజిన్ మరియు ఈటీవీ, జెమినీ టీవీ యాంకర్ రవళితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా పలువురు ఫోటోలు దిగారు.

తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. చిన్నలు పెద్దలు నృత్యాలతో, పాటలతో వేదికను హోరుమనిపించారు. మధ్య మధ్యలో రాఫుల్ విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలు షాపింగ్ స్టాల్ల్స్ దగ్గిర కలియ తిరుగుతూ కనిపించారు. యాంకర్ రవళి వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. చక్కని విందు బోజనాలను అందించిన గోదావరి రెస్టారెంట్ వారిని, స్పాన్సర్స్ అందరినీ మరియు ముఖ్యఅతిధులను పుష్పగుచ్ఛం, శాలువా మరియు మెమెంటోలతో గౌరవంగా సత్కరించారు. ఫ్రెండ్స్ ఆఫ్ రాయపురెడ్డి సమర్పించిన శ్రీ శ్రీనివాసరావు రాయపురెడ్డి మెమోరియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డును తామా తరపున బాలనారాయణ మద్ద కి అందజేశారు. ఈ సందర్భగా అందరూ రాయపురెడ్డిని, తాను తామాకి  అలాగే తెలుగు కమ్యూనిటీ మొత్తానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

గ్రాండ్ ఫినాలే లో భాగంగా యాజిన్ మరియు లిప్సిక తమ సంగీత కచేరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసారు. పిల్లలు మహిళలు అందరూ  స్టేజ్ మీదకు వెళ్లిమరీ డాన్సులు చెయ్యడం విశేషం. చివరిగా ప్రెసిడెంట్ వెంకీ గద్దె తామా తదుపరి కార్యవర్గాన్ని సభకు పరిచయం చేయగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భరత్ మద్దినేని తామా దివ్య దీపావళి వేడుకలకు సహకరించిన వాలంటీర్స్, స్పాన్సర్స్, స్టేజి డెకరేటర్ సుజాత పొన్నాడ, ఆడియో, లైటింగ్ అందించిన బీట్స్ అండ్ ఈవెంట్స్ వెంకట్ చెన్నుభొట్ల, ఫోటోగ్రఫీ సేవలందించిన రఘు, ప్రేక్షకులు తదితరులకు కృతఙ్ఞతలు తెలియజేసారు.

Click here for Event Gallery

 

Tags :