ASBL Koncept Ambience

అంబరాన్నంటిన అట్లాంటా తెలుగు సంఘం తామా సంక్రాంతి సంబరాలు

అంబరాన్నంటిన అట్లాంటా తెలుగు సంఘం తామా సంక్రాంతి సంబరాలు

జనవరి 29న అట్లాంటలో మారియెట్టా నగరంలోని లాసిటర్ కాన్సర్ట్ హాల్లో తామా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. శేఖర్స్ రియాల్టీ సమర్పించిన ఈ వేడుకలకు నగరంలోని తెలుగువారు సుమారు 600 మందికి పైగా పాల్గొన్నారు. ప్రుడెన్షియల్ శేషగిరి మండవ సహకారంతో, ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు మరియు పిల్లలకు కళా పోటీలు నిర్వహించారు.

ముందుగా తామా సాంస్కృతిక కార్యదర్శి ప్రియ బలుసు  ఉచిత క్లినిక్, మనబడి, వివిధ సదస్సులు, స్కాలర్షిప్స్, సాహిత్య కార్యక్రమాలు లాంటి తామా కార్యక్రమాలను వివరించి అందరికి ఘన స్వాగతం పలికారు. తర్వాత తామా ప్రధాన కార్యదర్శి వెంకీ గద్దె, తామా కార్యవర్గం మరియు బోర్డు సభ్యుల చేతులమీదుగా ముగ్గులపోటీ మరియు పిల్లల కళా పోటీల విజేతలకు బహుమతులు అందజేయించారు. తదనంతరం మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే టాలీవుడ్ గాయకులు నరేంద్ర తన పాటలతో ఉర్రూతలూగించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను బహుకరించారు.

ఈకార్యక్రమానికి సమర్పకులు శేఖర్స్ రియాల్టీ యజమానులు శేఖర్  తాడిపర్తి  గారిని మరియు వారి జట్టుని తామా కార్యవర్గం మరియు బోర్డు సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా శేఖర్ గారు తమ సంస్థ కార్యకలాపాలను వివరించి, తామా చేస్తున్న కార్యక్రమాలను అభినంచించారు. అలాగే తామా ప్రెసిడెంట్ హర్ష యర్నేని గారిని, తామా ఎడ్యుకేషన్ సెక్రటరీ రాజేష్ తడికమళ్ల గారిని అభినందించారు. తదనంతరం ఆటా ప్రెసిడెంట్ గా ఎన్నికైన కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డి గారిని పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. కరుణాకర్ రెడ్డి గారు తామా గురుంచి, తామా తో వున్నా అనుబంధం గురుంచి కొంచెం సేపు ప్రసంగించారు. అలాగే సింగర్ నరేంద్ర మరియు భానుశ్రీ ని వేదికమీదికి పిలిచి సత్కరించారు. ఈసందర్భంగా ప్రెసిడెంట్ హర్ష యర్నేని మరియు చైర్మన్ నగేష్ దొడ్డాక సభని ఉద్దేశించి ప్రసంగించారు.

\r\n\r\n

మహిళలు మరియు పిల్లలు ఉచిత మెహందీ మరియు స్టాల్స్ దగ్గిర తిరుగుతూ కనిపించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రావణి రాచకుల్లా, రజనీకాంత్, మరియు సుబ్బారావు మద్దాళి వ్యవహరించారు. చివరిగా కనివీని ఎరుగని రీతిలో సంక్రాంతి సంబరాలని విజయవంతం చేసిన అట్లాంటా తెలుగు ప్రజలకి, లాసిటర్ కాన్సర్ట్ హాల్ యాజమాన్యానికి, వీడియో మరియు ఫోటో సేవలందించిన వాకిటి క్రియేషన్స్ కి, ఆడియో దగ్గిర సహాయం చేసిన దేవానంద్ గారికి, వేదికను అందంగా అలంకరించిన శుభ్ ఈవెంట్స్ వారికి, రుచికరమైన విందుభోజనాలను అందించిన కర్రీస్ బిస్ట్రో ఇండియన్ రెస్టారెంట్, కళాకారులకి, వాలంటీర్స్ రూపేంద్ర వేములపల్లి, శివ సబ్బి, పెదబాబు తుర్లపాటి, నవీన్ పావులూరి, ప్రశాంత్ వీరబొమ్మ, శ్రీనివాస్ లావు, మల్లిక్ మేదరమెట్ల, భరత్ అవిర్నేని, సభాముఖంగా తామా ప్రధాన కార్యదర్శి వెంకీ గద్దె ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని విజయ వంతంగా ముగించారు.


Click here for Event Gallery

 

Tags :