మహాసభల్లో తమిళ తెలుగోళ్ల సందడి
ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు నుంచి తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమిళనాడు నుంచి 500 మందికి పైగా తెలుగువారు తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చారని తమిళనాడు తెలుగు ఫెడరేషన్ ప్రతినిధి కృష్ణమూర్తి తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఆయన కొనియాడారు. ఇతరరాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారి కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగోడు గర్వించదగిన రీతిలో మహసభలు జరుగుతున్నాయని, ఇది భవిష్యతరాలకు మంచి శుభపరిణామమని తమిళనాడు ఆంధ్ర సాంస్కృతిక సమితి కార్యదర్శి అన్నయప్ప అన్నారు. రెండు సంవత్సరాల నుంచి తమిళనాడులో తెలుగు మాట్లాడేవారిపై తమిళం మాట్లాడాలనే ఒత్తిడి పెరుగుతోందని, ఇలాంటి సమస్యలను తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలన్నారు.