ASBL Koncept Ambience

బ్రాహ్మణులకు తానా-ప్రభల కుటుంబ సహాయం

బ్రాహ్మణులకు తానా-ప్రభల కుటుంబ సహాయం

హైదరాబాద్‍లో కోవిడ్‍ 19 కారణంగా, లాక్‍డౌన్‍ వల్ల ఉపాధికి దూరమై ఎంతోమంది బ్రాహ్మణులు నిత్యావసర వస్తువులు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ప్రభల కుటుంబం కలిసి హైదరాబాద్‍లోని ఇసిఐఎల్‍ కమలానగర్‍లో ఉన్న కైలాసగిరి దేవాలయంలో దాదాపు 15 బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేసింది. ఈ కార్యక్రమాన్ని రాము, అన్నపూర్ణ ప్రభల కో ఆర్డినేట్‍ చేశారు. విక్రమ్‍ ప్రభల (ఒహాయో), రఘురామ్‍ ప్రభల (న్యూజెర్సి), కుమార్‍ నేతి (విఎ)తోపాటు హైదరాబాద్‍లోని బ్రాహ్మణ్యం గ్రూపు ఈ కార్యక్రమానికి అవసరమైన చేయూతను ఇచ్చింది. తానా కూడా ఈ కార్యక్రమంలో తనవంతుగా సహాయపడటంతోపాటు, ఆంధప్రదేశ్‍, తెలంగాణలో కూడా ఇలాంటి కార్యక్రమాలకు చేయూతను ఇచ్చింది.

Click here for Photogallery

 

 

Tags :