తానా ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనా మంత్రం శిక్షణ శిబిరం
ఉత్తర అమెరికాతెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనా మంత్రం పేరుతో సమ్మర్ క్యాంప్‍ను ఏర్పాటు చేశారు. పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్యాంప్‍లో 6 కొత్త అన్నమయ్య సంకీర్తనలను నేర్పించనున్నారు. అన్నమయ్య సంకీర్తనలో ఉన్న గొప్పమంత్రాన్ని తెలియజేసే ఈ సంకీర్తనలను అందరూ నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో తానా ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంప్‍ను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి తెలిపారు. సెప్టెంబర్‍లో అన్నమయ్య సంకీర్తనలపై ప్రపంచవ్యాప్తంగా పోటీలను కూడా నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారి ఆల్బమ్‍లు కూడా తానా రిలీజ్ చేయనున్నది. తానా 2021 కాన్ఫరెన్స్లో వారికి పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ సమ్మర్ క్యాంప్‍లో చేరాలనుకునేవారు 50డాలర్లను రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. 12 క్లాస్‍లు ఉంటాయని, జూలై 1లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, క్లాస్‍లు గురుపూర్ణిమ రోజున జూలై 4వ తేదీన ప్రారంభమవుతాయని తానా కల్చరల్ కో ఆర్డినేటర్ సునీల్ పాంత్రా చెప్పారు.
Link for Registration
https://www.cognitoforms.com/TANA3/ANNAMAYYASANKEERTHANAMANTRAM