బే ఏరియాలో తానా 5కె రన్ సక్సెస్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బే ఏరియాలో నిర్వహించిన తానా మనవూరి కోసం 5కె రన్ విజయవంతమైంది. మౌంటెన్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని తానా నాయకులు పేర్కొన్నారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), పాఠశాల, విరిజల్లు ఆశాజ్యోతి తదితర సంస్థలకు చెందినవారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. బావార్చి, స్వాగత్, ఎస్‌ఆర్‌ఎస్ కన్సల్టింగ్ ఇంక్, జస్పర్ టెక్నాలజీస్, రైట్ ప్రోస్ వంటి సంస్థలు ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించాయి. వంశీ పాలడుగు, చంద్ర గుంటుపల్లి, నవీన్ కొడాలి, మౌంటెన్ హౌస్ టీమ్ ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.
తానా రీజినల్ కో ఆర్డినేటర్ రజనీకాంత్ కాకర్ల, జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి, ఫౌండేషన్ ట్రస్టీ భక్తబల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాటా నాయకులు ప్రసాద్ మంగిన, యశ్వంత్ కుదరవల్లితోపాటు రామ్‌తోట, శ్రీకాంత్ దొడ్డపనేని, జెపి, శ్రీని వల్లూరిపల్లి, భరత్ ముప్పాల, శ్రీకాంత్ వై, లక్ష్మీపతి, వెంకట్ పిన్నపు, వీరపనేని శ్రీనివాస్, శ్రీకర్, సుబ్బ యంత్ర, సూర్య, అనుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పాన్సర్లకు, పలువురికి తానా నాయకులు బహుమతులను, ప్రశంసాపత్రాలను అందించారు. బావార్చి సంస్థ అందరికీ ఆహారాన్ని స్పాన్సర్ చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, నిరంజన్ శృంగవరపు అభినందలు తెలిపారు.