ASBL Koncept Ambience

ఆరోగ్యంపై అవగాహనకే తానా 5కె రన్‌ - జే తాళ్ళూరి

ఆరోగ్యంపై అవగాహనకే తానా 5కె రన్‌ - జే తాళ్ళూరి

ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికే తానా 5 కె రన్‌ వంటి కార్యక్రమాలను చేపట్టిందని, ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం సొంతమవుతుందని తానా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌, చైతన్యస్రవంతి కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ జే తాళ్ళూరి అన్నారు. తానా, ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) సంయుక్త ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శుక్రవారం 5కె రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 'హ్యాపీస్కూల్‌-హెల్తీ ఇండియా' అనే నినాదంతో కొత్తగూడెం ప్రకాశం మైదానం నుంచి సెంట్రల్‌ పార్క్‌ వరకు పరుగు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌శైనీ, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ పరుగులో వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు, సీనియర్‌ సిటిజన్స్‌ ప్రత్యేక దుస్తులు ధరించి పాల్గొన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో తానా నాయకులతోపాటు డాక్టర్‌ విజయ్‌కుమార్‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, డాక్టర్‌ వాసిరెడ్డి రమేశ్‌బాబు, డాక్టర్‌ విజయేందర్‌, కోనేరు పూర్ణచందర్‌రావు, వనమా రాఘవ, సాబీర్‌పాషా, వెంకట్‌, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

 

Tags :