ASBL Koncept Ambience

కొత్తగూడెంలో 'తానా' కార్యక్రమాల వివరాలు

కొత్తగూడెంలో 'తానా' కార్యక్రమాల వివరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కొత్తగూడెంలో 28వ తేదీ ఉదయం 7.30 కు 5కె వాక్‌ జరుగుతుందని ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ జే తాళ్ళూరి తెలిపారు. ప్రకాశం స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ 5కె వాక్‌ సెంట్రల్‌ పార్క్‌లో ముగుస్తుంది. ఉదయం 9.30కు ప్రకాశం స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 10.30కు డిజిటల్‌ తరగతులకు కావాల్సిన పరికరాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 11.30కి రైతుకోసం కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఐటీడిఎ కార్యాలయం ఆవరణలో భద్రాచలం ప్రదర్శన ప్రారంభమవుతుంది. రైతుకోసం, 50 స్కూళ్లకు డిజిటల్‌ తరగతుల పరికరాల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

 

Tags :