ఖమ్మంలో 'తానా’ ఆదరణ కార్యక్రమం
తానా సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం కావాలని అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు అన్నారు తానా ఆదరణ కార్యక్రమంలో భాగంగా సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు వికలాంగులు, విద్యార్థులకు వాహనాలు, వస్తువులను పంపిణీ కార్యక్రమాన్ని ఆయన తానా పూర్వ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా 46 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో విశిష్ట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఆరోగ్య పరీక్షలు, శస్త్ర చికిత్స, విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తోందన్నారు. భాషా సేవలో భాగంగా తెలుగు అభివృధ్దికి కృషిచేసిదన్నారు. ఖమ్మంతో తనకు విశేష అనుబంధం ఉందన్నారు. అనేక సేవాకార్యక్రమాలకు తాను హాజరయ్యానని చెప్పారు.
తానా పూర్వఅధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భవిష్యత్‌లో కూడా ఇదేసేవ కొనసాగుతుందన్నారు. తానాకు ఖమ్మంతో విశేష అనుబంధం ఉందన్నారు. తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ తానా సేవలకు ఇంత పెద్ద సంఖ్యలో గుర్తింపురావటానికి గత తానా ప్రతినిధుల సేవలే కారణమన్నారు. భవిష్యత్‌లో సైతం సేవా కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తామన్నారు. జిల్లాకు చెందిన పలువురు గతంలో తానాకు సేవలందించటంతోపాటు మరెందరో తానా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు.
సామినేని ఫౌండేషన్ అధ్యక్షుడు రవి సామినేని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బోస్, తానా ట్రస్టీ విశ్వనాధ్, తానా కార్యదర్శి సంతోష్ వేమూరి, ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ ప్రతినిధులు బండి నాగేశ్వరరావు, శ్రీనివాస్, కృష్టారావు, సునీత, కార్పొరేటర్లు, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, విద్యావేత్త రవి మారుత్, తదితరులు పాల్గొ న్నారు. అలాగే అన్నం సేవా ఫౌండేషన్‌కు సోలార్ ప్లాంటు ఏర్పాటుకు తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు తరపున తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రూ. 7,50,960 చెక్కును అన్నం శ్రీనివాసరావుకు అందజేశారు.