తానా ప్రశంసా పత్రాల బహుకరణ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన పేరుతో సాహితీ చరిత్రలోనే అపూర్వంగా తెలుగు భాషా సాంస్కతిక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి ఈ కారక్రమాన్ని జనవరి 6, 2020వ తేదీన న్యూయార్క్ నగరంలో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరు లక్షలమంది బాలబాలికలు, మూడు వేల పాఠశాలల నుండి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వీరు అమ్మ నాన్న గురువు శతక పద్యాలను కంఠస్థం చేసి ఎవరి పాఠశాలలో వారు సామూహిక గానం చేశారు. వీరి ప్రతిభను అభినందిస్తూ తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, తానా బోర్డ్ చైర్మన్ హరిష్ కోయ, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా (తదుపరి అధ్యక్షుడు) అంజయ్య చౌదరి. తానా కార్యదర్శి రవి పొట్లూరి సంతకాలతో కూడిన ప్రశంసాపత్రాలను ఆయా స్కూళ్ళకు పంపించింది. ఈ సర్టిఫికెట్‍లను కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఇతర కో ఆర్డినేటర్‍ల ఆధ్వర్యంలో ఆయా స్కూళ్ళకు పంపిణీ చేసి అందరికీ అందజేశారు.