ASBL Koncept Ambience

తానా-బాటా ఆధ్వర్యంలో హెల్త్ సిబ్బందికి 400 ఫేస్ షీల్డ్ ల పంపిణీ

తానా-బాటా ఆధ్వర్యంలో హెల్త్ సిబ్బందికి 400 ఫేస్ షీల్డ్ ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్‍ ఆధ్వర్యంలో ఫ్రీమాంట్‍లోని ట్రైసిటీ హెల్త్ సెంటర్‍ సిబ్బందికి 400 ఫేస్‍ షీల్డ్ లను బహుకరించారు. కోవిడ్‍ 19 వైరస్‍ నుంచి రక్షణ కోసం ఈ పరికరాన్ని అందించినట్లు తానా, బాటా నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్‍ సిబ్బందికి తమ రక్షణకు కిట్‍లు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, తానా చేస్తున్న కమ్యూనిటీ సేవలను ప్రశంసించారు. తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు, ఇవిపి అంజయ్య చౌదరి లావు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బే ఏరియా తానా నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఫ్రీమాంట్‍ సిటీ కౌన్సిల్‍ మెంబర్‍ రాజ్‍ సల్వాన్‍, జయరామ్‍ కోమటిలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బే ఏరియా తానా నాయకులు సతీష్‍ వేమూరి, వెంకట్‍ కోగంటి, రజనీకాంత్‍ కాకర్ల, భక్తబల్లాతోపాటు, బాటా నాయకులు విజయ ఆసూరి తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :