ASBL Koncept Ambience

బ్రాహ్మణులకు సాయం చేసిన తాళ్ళూరి ట్రస్ట్, తానా

బ్రాహ్మణులకు సాయం చేసిన తాళ్ళూరి ట్రస్ట్, తానా

కరోనా వైరస్‍ కారణంగా ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులను ఆదుకునేందుకు తాళ్ళూరి ట్రస్ట్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ముందుకు వచ్చింది. భద్రాచలంలో 2000 రూపాయల విలువగల నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. 130 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సామాగ్రితోపాటు, 500 రూపాయల నగదు అందజేశారు. తాళ్లూరి ట్రస్ట్ అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‍, ఎన్నారైలు డాక్టర్‍ తాళ్లూరి రాజా శ్రీకృష్ణ ఈ  సేవా కార్యక్రమానికి సహకారాన్ని అందించారు.

లాక్‍డౌన్‍ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన తాళ్ళూరి ట్రస్ట్, తానాకు బ్రాహ్మణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి ట్రస్ట్ అధ్యక్షుడు పంచాక్షరయ్య, వల్లూరిపల్లి వంశీకృష్ణ, బిక్కసాని శ్రీనివాసరావు, అడుసుమిల్లి జగదీష్‍, చావా లక్ష్మీనారాయణ, పల్లంటి దేశప్ప, చక్రవర్తి, అల్లం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :