ASBL Koncept Ambience

అన్నమయ్య థీంపార్క్ పరిశీలన

అన్నమయ్య  థీంపార్క్ పరిశీలన

కడప జిల్లా రాజంపేటలోని  అన్నమాచార్యుల విగ్రహ పరిసర ప్రాంతామైన థీంపార్కును తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పరిశీలించారు. అన్నమాచార్యుల థీంపార్కు వద్ద ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), టీటీడి అధికారులు కలిసి నిర్వహించే కార్యక్రమాలకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించేందుకు టీటీడి అధికారులు, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలోనే తానా రైతులకు రక్షణ పరికరాలను కూడా పంపిణీ చేయనున్నది.  తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈఈ విజయలక్ష్మి ఇతర అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, హరి, నరేంద్ర, మల్లికార్జున తదితరులు టీటీడి అధికారులతోపాటు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

 

Tags :