ASBL Koncept Ambience

మాస్క్ లు, ఫుడ్ పంపిణీ చేసిన తానా అప్పాచియాన్ టీమ్

మాస్క్ లు, ఫుడ్ పంపిణీ చేసిన తానా అప్పాచియాన్ టీమ్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అప్పాచియాన్‍ టీమ్‍ ఆధ్వర్యంలో కోవిడ్‍ 19 సంక్షోభవేళలో వివిధ చోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాలే, ఛార్లెట్‍, నాష్‍విల్లే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. రాలే టీమ్‍ ఆధ్వర్యంలో దుర్హం రెస్యూమిషన్‍కు  దాదాపు 500 కేన్స్ ఫుడ్‍, శానిటైజర్లు, మాస్క్లను అందించారు. శాన్‍ఫోర్డ్ హెల్త్ రిహబిలిటేషన్‍ సెంటర్‍కు 350 మాస్క్లను, మోరిస్‍విల్లే ఫైర్‍ డిపార్ట్మెంట్‍ సిబ్బందికి హాట్‍ ఫుడ్‍, పండ్లు, కూరగాయలు, చిప్స్, సోడా అందించారు. ఎన్‍సిలో ఉన్న సిద్ధి వినాయక టెంపుల్‍ పూజారికి నెలకు సరిపోయే గ్రాసరీస్‍ను ఇచ్చారు. కోవిడ్‍ 19 కారణంగా టెంపుల్‍ను మూసేయడంతో పూజారికి ఆదాయం లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి తానా టీమ్‍ ఆయనను ఆదుకుంది. శ్రీనివాస్‍ అరెమండ, గోకుల్‍ తిపిర్నేని (అప్నా బజార్‍) పూజారికి సామాన్లు ఇచ్చారు. ప్రవీణ్‍ తాతినేని, వెంకట్‍ కుర్ర, రాజేష్‍ యార్లగడ్డ (సింగపూర్‍), కిరణ్‍ కాకర్లమూడి, కేదా బడిసెట్టి, శ్రీధర్‍ గోరంటి, సునీల్‍ కొల్లూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస్‍ అరెమండ, కుమార్‍ నేపల్లి కాశిగల్లు టీమ్‍, శ్రీని మార్తాల, సురేష్‍ వెల్లంకి (వుయ్‍ స్ట్రైవ్‍) ఈ కార్యక్రమానికి అవసరమైన చేయూతను అందించారు.

Tags :