ASBL Koncept Ambience

తానా అవార్డుల ప్రకటన

తానా అవార్డుల ప్రకటన

విధి నిర్వహణలోనే కాకుండా సమాజసేవలో తనదైన  ముద్ర వేసుకున్న కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణకు తానా అవార్డుతో సత్కరించాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్ణయించింది. మే 17న జరిగిన తానా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణతో పాటు సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌, ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్‌ డా.లక్ష్మి, సలీం కాన్సాస్‌ నగరంలో జరిగిన కాల్పులలో మరణించిన శ్రీనివాస్‌ కూచిభొట్ల అనే తెలుగు యువకుడిని రక్షించబోయి తీవ్రంగా గాయపడిన ఇయాన్‌ గిలియట్‌లని అవార్డుతో సత్కరించాలని తానా కార్యవర్గ సమవేశం నిర్ణయించింది. తానా జీవితకాల సాఫల్య పురస్కారంతో పద్మభూషణ్‌ మాజీ ఎంపీ డా.యార్లగడ లక్ష్మి ప్రసాద్‌, తానా ఎన్టీఆర్‌ కల్చరల్‌ అవార్డుతో పాటు ప్రముఖ సినీ రచయిత  సిరివెన్నెల సీతారామశాస్త్రిని సత్కరించాలని కూడా తానా కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. మే 26 నుంచి 28 వరకు సెయింట్‌ లూయిస్‌ నగరంలో జరగనున్న జరగనున్నా తానా 21వ మహాసభలలలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

 

Click here for Photogallery

Tags :