తానా మహాసభలు... ఉత్తమ ప్రతిభకు, సేవకు పురస్కారాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జూలై 7,8,9వ తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న తానా 23వ మహాసభలను పురస్కరించుకుని, ఉత్తమ ప్రతిభగల వారిని ప్రోత్సహించి అవార్డులతో ఘనంగా సత్కరించేందుకు తానా అవార్డ్స్ కమిటి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్య, వైద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, క్రీడా, సాహిత్య, కళల, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సంఘ సేవ, తానా సేవ తదితర రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ‘‘తానా అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్’’ తో మహాసభల వేదికపై సత్కరించనున్నారు.
ఈ అవార్డుకు అర్హులైన వారి పేర్లను ఎవరైనా పంపించవచ్చు. వారి పూర్తి వివరాలు ఆంగ్లంలో లేక తెలుగులో రాసి, ఫోటో జతపరిచి ఇ-మెయిల్ లో పంపించాల్సిందిగా కోరుతున్నాము. మీరు ప్రతిపాదించడానికి చివరి గడువు జూన్ 10వ తారీకు అని గమనించాలి.
పంపించాల్సిన ఇ-మెయిల్ awards@tanaconference.org