డల్లాస్ బ్యాక్ ప్యాక్ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న జే తాళ్ళూరి
డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో బ్యాక్‌ప్యాక్స్ కార్యక్రమంలో భాగంగా 250 మంది చిన్నారులకు స్కూల్ బ్యాగ్‌లను డల్లాస్ తానా టీమ్ పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు జే తాళ్లూరి పాల్గొని తానా ఆధ్వర్యంలో కమ్యూనిటీకోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే బ్యాక్‌ప్యాక్స్ పథకం కింద అమెరికాలోని పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా టాంటెక్స్ టీమ్‌ను ఆయన అభినందించారు. సాంబ, ఇతర సభ్యులను కూడా జే తాళ్ళూరి ప్రశంసించారు. బ్యాక్‌ప్యాక్స్ పథకం రూపకర్త డా. నవనీత కృష్ణను జే తాళ్లూరి కలిశారు. ప్రసాద్ తోటకూర, మురళీ వెన్నం, చలపతిరావు, మురళీ తాళ్ళూరి, లోకేష్ నాయుడు, లెనిన్ తుళ్ళూరు, వినోద్ వుప్పు, కుమార్ నందిగామ్, ప్రవీణ్ కొడాలి, విజయ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.