ASBL Koncept Ambience

తానా బ్యాడ్మింటన్‍ -టీటీ పోటీలకు మంచి స్పందన

తానా బ్యాడ్మింటన్‍ -టీటీ పోటీలకు మంచి స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మిచిగన్‍లోని నార్త్విల్లేలో నిర్వహించిన తానా 2020 నార్త్ రీజియన్‍ బ్యాడ్మింటన్‍, టీటీ చాంఫియన్‍ షిప్‍ పోటీలకు మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్నారు. దాదాపు 150 మంది ఆటగాళ్ళు, 75కిపైగా టీమ్‍లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఉత్కంఠగా జరిగిన ఈ పోటీల్లో ఎంతోమంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి నాయకత్వంలో సునీల్‍ పాంత్రా, లోకేష్‍ నాయుడు సహకారంతో ఈ పోటీలు విజయవంతమయ్యాయని తానా రీజినల్‍ కో ఆర్డినేటర్‍ కిరణ్‍ చౌదరి తెలిపారు. గంగాధర్‍ నాదెళ్ళ, జో పెద్దిబోయిన, శివరామ్‍ యార్లగడ్డ తదితరులు ఈ టోర్నమెంట్‍ను తిలకరించారు. శివరామ్‍ జూజియవరపు, సంతోష్‍ ఆత్మకూరు, శిరీష ప్రతాప, దురైరాజన్‍, నీలిమ మన్నె, ఉమా మహేష్‍ యాదవ్‍, సుభాకర్‍ వెలగ, శ్రీధర్‍ బండారు తదితరులు టోర్నమెంట్‍ నిర్వహణకు సహకరించారు. 

Tags :