తానా బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వాషింగ్టన్ డీసిలో నిర్వహిస్తున్న 22వ తానా మహాసభల నిర్వహణలో భాగంగా వివిధరకాల ఆటల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మే 5వ తేదీన తానా బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. యాష్‌బర్న్‌లోని నార్తర్న్ వర్జీనియా బ్యాడ్మింటన్ క్లబ్‌లో ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో విజేతలుగా నిలిచినవారికి 2500డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఒక ఈవెంట్‌కు 20 డాలర్లు, 3 ఈవెంట్‌లకు 30 డాలర్లను రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. పోటీలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 571 509 8800 వాట్సప్ నెంబర్‌ను సంప్రదించండి.
Tags :