ASBL Koncept Ambience

తిరుపతిలో 'గోవిందధామం' నిర్మించిన 'తానా'

తిరుపతిలో 'గోవిందధామం' నిర్మించిన 'తానా'

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆర్థిక సహకారంతో తిరుపతిలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన గ్యాస్‌ ఆధారిత శ్మశానవాటిక 'గోవిందధామం' ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తానా మాజీ అధ్యక్షుడు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు, తానా పత్రిక ప్రధాన సంపాదకులు కేసీ చేకూరి, తానా ప్రాంతీయ ప్రతినిధులు రఘు మేకా, విశ్వనాథ్‌ నాయునిపాటి, కమిటీ సభ్యులు సుధీర్‌ చింతమనేని, రాకేష్‌ బత్తినేని తదితరులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మూడుకోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మహాప్రస్థానం వివరాలను సతీష్‌ వేమన చంద్రబాబుకు వివరించారు. పచ్చదనంతో పురుషులకు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లతో దీనిని నిర్మించారు. అలాగే తానా తరపున 30 లక్షల రూపాయల చెక్కును కూడా వారు ముఖ్యమంత్రికి అందజేశారు. గోవిందధామం నిర్వాహకులు టెంకాయల దామోదరం, వేమూరి జయప్రసాద్‌, నాగేశ్వరరావు, హేమచందర్‌ కూడా ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు.

 

Tags :