తానా బిజినెస్ సమావేశాలకు ప్రముఖుల రాక
తానా మహాసభల్లో భాగంగా బిజినెస్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశాలకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు వస్తున్నారు. మేరీలాండ్ రాజకీయాల్లో ఇమేజ్ సృష్టించుకున్న తెలుగు సంతతికి చెందిన మహిళ అరుణ మిల్లర్ బిజినెస్ ఆఫ్ పాలిటిక్స్ అన్న అంశంపై ప్రసంగించనున్నారు. టెక్నాలజీ బిజినెస్‌లో మన శక్తిని ఉపయోగించడంలో న్యూజెర్సి తెలుగు ప్రముఖుడు ఉపేంద్ర చివుకుల, లీగల్ అండ్ ట్యాక్స్ రెగ్యులేషన్‌లో దేవేంద్ర శర్మ ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. ఇండియాలో పవర్ రంగంలో పెట్టుబడులు పెట్టే విషయంలో రఘురామ కృష్ణంరాజు, సినిమా రంగంలో పెట్టుబడులు అన్న అంశంపై అల్లు అరవింద్ ప్రసంగించనున్నారు. హెల్త్ కేర్ మేనెజ్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ అంశంపై డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, ఇండియన్ రియల్ ఎస్టేట్, అమరావతిలో అవకాశాలు అన్న అంశంపై ఎవిఆర్ చౌదరి ప్రసంగిస్తారు. దీంతోపాటు బిజినెస్ కమిటీ ప్రేరణ, మేధ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. మే 27, 28 తేదీల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి.