ASBL Koncept Ambience

పౌరాణికాల ప్రోత్సాహానికి 'తానా' కృషి - జంపాల

పౌరాణికాల ప్రోత్సాహానికి 'తానా' కృషి - జంపాల

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచెప్పేదే కళలు మరుగునపడిపోరాదని, వాటిని ఎల్లప్పుడు సజీవంగా ఉంచుకునేందుకు అందరూ కృషి చేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జంపాల చౌదరి అన్నారు. కళల ప్రోత్సాహంలో తానా ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.\r\n\r\n

స్థానిక ఎంసీఏలో తానా చైతన్య స్రవంతి మన ఊరి కోసం కార్యక్రమంలో పౌరాణిక నాటకాలు  కూచిపూడి, కథక్‌ శివతాండవం వంటి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ దేశాల్లో భారతదేశం కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పే విధంగా కళారంగం ఉందన్నారు. ప్రతి ఒక్క పౌరుడు ఎంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించినవారు కన్నవారిని, సొంత ఊరిని మరువరాదన్నారు. చేతనైనంత సహాయ సహకారాన్ని ఇతరులకు అందిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తానా సభ్యుల సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి మనిషి తమ బాధ్యతను ఎరిగి తోటివారికి సహాయ పడాలనే  గుణాన్ని పెంపొందించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. తీర ప్రాంతంలో  ఎంసీఏ చేసే సేవా కార్యక్రమాలు  అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఏంసీఏకు తమ  సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మడ అడవుల పెంపుదలకు కృషి చేసి అంతర్జాతీయ పురస్కారం అందుకున్న అవపర్తి వెంకట అప్పారావును, బౌద్ధ రచయిత బొర్రా గోవర్థన్‌, కళాకారులను, కూచిపూడి నృత్య ప్రదర్శన చిన్నారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తానా సభ్యులు గోగినేని  శ్రీనివాసరావు, సతీష్‌ వేమన, కోమటి జయరామ్‌, జయశేఖర్‌, ఎన్‌.గంగాధర్‌, చలపతి, చింతమనేని సుధీర్‌, వాసుదేవరావు, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

 

Tags :