ASBL Koncept Ambience

విజయవాడలో ఆకట్టుకున్న 'తానా' సాంస్కృతిక కార్యక్రమాలు

విజయవాడలో ఆకట్టుకున్న 'తానా' సాంస్కృతిక కార్యక్రమాలు

విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సోమవారం జరిగిన తానా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగువారి జానపద కళా ప్రదర్శనలు నేత్రపర్వంగా సాగాయి. జానపద, కూచిపూడి సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను మైమరపింపజేశాయి. ఎపి ప్రభుత్వ సాంస్కృతిక శాఖ తరపున కె. శశిధర్‌ వీణావాదం రసరమ్యంగా సాగింది. నాగిని సంగీతం, వాతాపి గణపతిమ్‌, అన్నమాచార్య కీర్తనలను ఆలపించి శ్రోతలను ఓలలాడించారు. వీరికి కుమార్‌ మృదంగంపై, కేవి కిషోర్‌ ఘటంపై వాద్యసహకారం అందించారు. దామోదర గణపతి బృందం ఆలపించిన జానపద గేయ నృత్య కదంబం ఉర్రూతలూగించింది. అడవితల్లికి దండాలో, గల్‌గల్‌ చప్పళ్ళు, మందులోడా, ఓరి మాయలోడా వంటి పల్లె జానపదాలతో అలరించారు.

సిద్ధార్థ నర్సింగ్‌ స్కూల్‌ విద్యార్థినులు ప్రదర్శించిన మణిపురి డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫోక్‌డ్యాన్స్‌ ఉర్రూతలూగించింది. విజయనగరానికి చెందిన డి. రాంబాబు బృందం డప్పులు వాయిస్తూ, ఆ సవ్వడికి అనుగుణంగా నృత్యాలు, వాటితోపాటు విన్యాసాలను ప్రదర్శించింది. శ్రీకాకుళంకు చెందిన విజయ్‌బాబు బృందం గరగలు చేసింది. యువకళాకారిణి లేఖ్యా భరణి చేసిన కథక్‌ నృత్యం అలరించింది. కెసిపి సిద్ధార్థ విద్యార్థుల అమ్మోరు జాతర నృత్యం, మైమ్‌ స్కిట్‌, విపిఓస్‌ సిద్ధార్థవిద్యార్థుల కూచిపూడి నృత్యం తెలుగు చైతన్యంపై సందడి చేసింది. 


Click here for Event Gallery

 

Tags :